HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Good News For Tirumala Srivari Devotees A Dream Is About To Come True

Tirumala Tirupathi Devasthanam : తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్నెరవేరబోతున్న కల..!

  • Author : Vamsi Chowdary Korata Date : 19-11-2025 - 11:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tirupati Achutham Sripatham
Tirupati Achutham Sripatham

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో శ్రీపాదం, అచ్యుతం సముదాయాల నిర్మాణం 75% పూర్తయింది. దాదాపు పదివేల మందికి వసతి కల్పించే ఈ ప్రాజెక్టుతో పాటు, అలిపిరి సమీపంలోనూ కొత్త వసతి సముదాయాలు నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. దీంతో భక్తుల వసతి సమస్యలు త్వరలో తీరనున్నాయి. ఈ రెండు సముదాయాలు అందుబాటులోకి వస్తే శ్రీవారి భక్తులకు గదుల సమస్యలు ఉండవని చెబుతున్నారు.

తిరుమల శ్రీవారి భక్తులకు తీపికబురు.. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఎదుర్కొంటున్న వసతి సమస్యలు త్వరలోనే తీరనున్నాయి.. త్వరలో వసతి సౌకర్యం మెరుగుపడనుంది. తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో గోవిందరాజస్వామి సత్రాల స్థానంలో నిర్మిస్తున్న శ్రీపాదం, అచ్యుతం సముదాయాల పనులు 75% పూర్తయ్యాయి. ప్రధాన భవనం, గదుల నిర్మాణం పూర్తయినా, లోపలి ఏర్పాట్లు, మౌలిక సదుపాయాల కల్పన పనులు మిగిలి ఉన్నాయి.

తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న గోవిందరాజస్వామి సత్రాల స్థానంలో కొత్తగా శ్రీపాదం, అచ్యుతం అనే రెండు సముదాయాలను నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ప్రధాన భవనం, గదుల నిర్మాణం పూర్తయింది. అయితే గదులలోపల అవసరమైన ఏర్పాట్లు చేయడం, నీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం వంటి పనులు ఇంకా మిగిలి ఉన్నాయి. ఈ పనులు చాలా ముఖ్యమైనవి.

తిరుపతిలో నిర్మిస్తున్న శ్రీపాదం, అచ్యుతం సముదాయాల్లో.. ఒక్కో భవనంలో తొమ్మిది అంతస్తులు నిర్మిస్తున్నారు. గదులు 532 చొప్పున 1,064 ఉన్నాయి. దాదాపుగా పదివేల మంది భక్తులకు వసతి కల్పించొచ్చు. రెండో అంతస్తులో రిసెప్షన్, అన్నదానం, వసతి కేంద్రాలు ఉంటాయి. మూడు, నాలుగు అంతస్తుల్లో 48 డార్మెటరీలు.. సుమారు 7,000 మందికి సరిపడా లాకర్ల ఏర్పాటు చేస్తున్నారు. 2024 మార్చి నెలలో పనులు ప్రారంభం అయ్యాయి.. ఏప్రిల్, 2026 నాటికి పూర్తి చేయాలని గడువు పెట్టుకున్నారు. ఈ రెండు సముదాయాల నిర్మాణానికి రూ.600 కోట్లు ఖర్చవుతోంది. వాస్తవానికి తిరుమలలో గదులు దొరకని భక్తులు తిరుపతిలోనే గోవిందరాజుల సత్రంలో గదులు తీసుకుంటారు. అయితే అక్కడా గదులు ఫుల్ అవుతున్నాయి.. ఈ క్రమంలో ఆ సత్రం స్థానంలో శ్రీపాదం, అచ్యుతం సముదాయాలను నిర్మిస్తున్నారు. ఎన్నో ఏళ్ల నెరవేరబోతోంది. ఇక గదుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు అంటున్నారు. దాదాపు 10వేలమందికి గదులు అందుబాటులోకి వస్తాయంటున్నారు. తిరుమలలో గదులు దొరకని భక్తులు తిరుపతిలో గదులు తీసుకునే వెసులుబాటు ఉంటుంది.

అంతేకాదు టీటీడీ ఇటీవల మరో కీలక నిర్ణయం తీసుకుంది. అలిపిరి సమీపంలో కూడా భక్తుల కోసం మరికొన్ని వసతి సముదాయాలను నిర్మించాలని నిర్ణయించారు. తిరుమలలో వసతి గదులు సరిపోవడం లేదు.. కొత్తగా అక్కడ సముదాయాలు నిర్మించలేని పరిస్థితి. ఈ క్రమంలో అలిపిరికి సమీపంలో వసతి సముదాయాలను నిర్మిస్తే ఇబ్బందులు లేకుండా పోతాయని భావిస్తున్నారు. అందుకే టీటీడీ పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ఈ వసతి సముదాయాలపై క్లారిటీ వస్తుందని చెబుతున్నారు టీటీడీ అధికారులు. మొత్తం మీద టీటీడీ వసతి గదుల విషయంలో ఇబ్బందుల్ని తొలగించే పనిలో ఉంది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Achyutham
  • andhra pradesh
  • Sripatham Pilgrim Amenities Complex
  • Tirumala Tirupathi Devasthanam
  • Tirupati Achyutham Sripatham
  • ttd
  • Ttd Achyutham

Related News

AP

AP : కుప్పంలో పీఎం మిత్రా పార్క్, అమరావతిలో నిఫ్ట్.. కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు

ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం, జౌళి రంగాలను అనుసంధానిస్తూ రైతులకు అదనపు ఆదాయం కల్పించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి పలు కీలక ప్రతిపాదనలు సమర్పించారు. సచివాలయంలో కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌తో జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని ఫైబర్ ఉత్పత్తి, వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో అరటి, కొబ్బరి, వెదురు

  • Indrakeeladri

    Vijayawada : ఇంద్రకీలాద్రికి పోటెత్తిభ‌క్తులు.. వేసవి దృష్ట్యా ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు

  • Gade Venkatreddy

    Gade Venkatreddy : మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత

  • Electric Shock

    Vijayawada : విజయవాడలో బక్రీద్ పండుగ రోజు విషాద ఘటన.. కరెంట్ షాక్‌తో హోంగార్డు మృతి

  • Mahanadu

    Mahanadu : ముగిసిన మ‌హానాడు.. వ‌ర్చువ‌ల్‌గా 24 ల‌క్ష‌ల మంది హాజ‌రు

Latest News

  • BJP : గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఓట్ల కోస‌మే ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌.. కాంగ్రెస్‌పై టీబీజేపీ చీఫ్ ఫైర్‌

  • Vaibhav : శతకం మిస్సైనా చరిత్ర సృష్టించిన వైభవ్.. ఐపీఎల్‌లో పలు రికార్డులు బద్దలు

  • IPL 2026 : సెంచరీతో చెలరేగిన గిల్.. ఐపీఎల్ ఫైనల్‌కి చేరుకున్న‌ గుజరాత్ టైటాన్స్

  • Land Scam : హైదరాబాద్ లో ప్రభుత్వ భూమి కబ్జా యత్నం.. వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు

  • Nellore : వేదాంత మీనాక్షి ఎనర్జీ 1000 మందికి స్వచ్ఛమైన తాగునీటి సదుపాయం!

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd