HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Good News For Ap Police Special Leaves Granted

AP Police: ఏపీ పోలీసులకు గుడ్ న్యూస్.. వారికి స్పెషల్ లీవ్స్

  • Author : Vamsi Chowdary Korata Date : 14-04-2026 - 12:59 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
AndhraPradesh Police Special Leaves
AndhraPradesh Police Special Leaves

AP Police Holidays  విధి నిర్వహణలో నిరంతరం తలమునకలై ఉండే ఏపీ పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక తీపి కబురు అందించింది. పండుగలు, పబ్బాలకు దూరంగా, కుటుంబ వేడుకలకు హాజరు కాలేక తీవ్రమైన ఒత్తిడితో పనిచేసే సిబ్బందికి ఊరటనిచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. పోలీసులు తమ వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇచ్చేలా, వారి పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవం రోజున ప్రత్యేక సెలవు మంజూరు చేయాలని డీజీపీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. కానిస్టేబుల్ స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు అన్ని ర్యాంకుల వారికి ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేశారు.

ఈ మేరకు రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్ని జిల్లాల ఎస్పీలకు, పోలీస్ విభాగాల అధిపతులకు ఆదేశాలు పంపారు. అత్యవసర పరిస్థితులు తలెత్తితే తప్ప, సిబ్బంది కోరిన వెంటనే ఈ ప్రత్యేక సెలవును మంజూరు చేయాలని ఆయన స్పష్టంగా సూచించారు. ఈ విషయంలో ఎలాంటి జాప్యం జరగకూడదని, సెలవు మంజూరు చేయడం తప్పనిసరి అని ఆదేశాల్లో పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు తమ కుటుంబ సభ్యులతో గడిపే సమయం చాలా తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో వారి జీవితంలో ముఖ్యమైన ఈ రెండు రోజుల్లోనైనా కుటుంబంతో సంతోషంగా గడిపేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రత్యేక సెలవుల ద్వారా సిబ్బంది మానసికంగా ఉల్లాసం పొంది, విధుల్లో మరింత ఉత్సాహంగా పాల్గొంటారని ఉన్నతాధికారులు ఆశిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పెన్షనర్లకు కొత్త నిబంధన

మరోవైపు పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ ప్రతిపాదనలకు సంబంధించి ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకు కొనసాగుతున్న ఫిజికల్ (మాన్యువల్) పద్ధతిలో పెన్షన్ ప్రతిపాదనలను సమర్పించేందుకు ఈ నెల 30వ తేదీ వరకు మాత్రమే అవకాశం కల్పించారు. మే 1వ తేదీ నుంచి రిటైర్డ్ ఉద్యోగులు తప్పనిసరిగా ‘నిధి’ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే తమ దరఖాస్తులను సమర్పించాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh police
  • AP DGP Harish Kumar gupta
  • AP government
  • AP Pensioners
  • ap police
  • AP Police holidays
  • DGP Harish Kumar Gupta
  • Harish Kumar Gupta
  • Police welfare

Related News

Big shock for YouTuber Ravan

Ravana: యూట్యూబర్ రావణ్‌కు బిగ్ షాక్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని విద్వేషపూరిత, పరువు నష్టం కలిగించే వీడియోలు రూపొందిస్తున్నారనే ఆరోపణలపై వివాదాస్పద యూట్యూబర్ జోసెఫ్ రావణ్ అలియాస్ ‘ప్రశ్న’ రావణ్‌పై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి ఆయనకు చెందిన బ్యాంకు ఖాతాలను అధికారులు స్తంభింపజేశారు. ‘ప్రశ్న’ అనే మాధ్యమం ద్వారా విద్వేషాన్ని రెచ్చగొట్టే వీడియోలన

  • AP government takes another key decision

    CM Chandrababu Naidu: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

  • YouTuber Ravan arrested again in another case.

    Ravan: మరో కేసులో యూట్యూబర్‌ రావణ్‌ మళ్లీ అరెస్టు

  • Promotions For Several Dsps

    AP Police : ఏపీ పోలీస్ శాఖలో పదోన్నతుల జాతర.. 12 మంది డీఎస్పీలకు పదోన్నతులు

  • Prakash Raj lashes out over repeated arrests of 'Ravan'.

    Prakash Raj: రావణ్ మళ్ళీ మళ్ళీ అరెస్ట్ పై ప్రకాష్ రాజ్ ఫైర్

Latest News

  • Heavy rains: వర్షం ఎఫెక్ట్‌.. రోడ్లు నదులుగా మారాయి

  • Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

  • Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

  • LPG gas cylinder: భారీ వర్షాలకు కొట్టుకొస్తున్న 3,000 ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు

  • Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd