Gang Raped: విజయవాడలో దారుణం.. మహిళపై మూడు రోజులపాటు సామూహిక అత్యాచారం
విజయవాడలో దారుణం జరిగింది. మహిళను గదిలో నిర్బంధించి మూడు రోజులపాటు నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారాని (Gang Raped)కి పాల్పడ్డారు. బాధితురాలు తీవ్ర అస్వస్థతతో సోమవారం నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరడంతో ఈ అమానుషం వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రి వర్గాల సమాచారంతో పెనమలూరు పోలీసులు వచ్చి బాధితురాలితో మాట్లాడారు. అత్యాచారాని(Gang Raped)కి పాల్పడిన వ్యక్తుల కోసం గాలిస్తున్నారు.
- By Gopichand Published Date - 10:53 AM, Tue - 20 December 22

విజయవాడలో దారుణం జరిగింది. మహిళను గదిలో నిర్బంధించి మూడు రోజులపాటు నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారాని (Gang Raped)కి పాల్పడ్డారు. బాధితురాలు తీవ్ర అస్వస్థతతో సోమవారం నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరడంతో ఈ అమానుషం వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రి వర్గాల సమాచారంతో పెనమలూరు పోలీసులు వచ్చి బాధితురాలితో మాట్లాడారు. అత్యాచారాని(Gang Raped)కి పాల్పడిన వ్యక్తుల కోసం గాలిస్తున్నారు. కృష్ణా జిల్లా విజయవాడ సమీపంలోని పెనమలూరులో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలిని ఆ ముఠా శరీరమంతా సిగరెట్ గాయాలతో అతి కిరాతకంగా చిత్రహింసలకు గురిచేసినట్లు సమాచారం.
సోమవారం ఈ దారుణం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని బెంజి సర్కిల్ వద్ద కూలి పనులు చేసుకునే ఓ మహిళను అదే ప్రాంతంలోని ఓ వ్యక్తి ఈ నెల 17న ఆమెను ఓ గదికి తీసుకెళ్లాడు. అక్కడ అతడి పాటు మరో ముగ్గురు ఆమెపై మూడు రోజులపాటు అత్యాచారానికి పాల్పడ్డారు. తీవ్ర అస్వస్థతకు గురైన బాధితురాలు సోమవారం ఆసుపత్రిలో చేరడంతో విషయం వెలుగు చూసింది. పెనమలూరు పోలీసులకు ఆసుపత్రి సమాచారం ఇవ్వడంతో వారు బాధితురాలితో మాట్లాడి వివరాలు తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అత్యాచారానికి పాల్పడిన నిందితుల కోసం గాలిస్తున్నారు.
Also Read: Hyderabad : హైదరాబాద్‌లో దారుణం.. బాలికపై మేనమామ అత్యాచారం