Hyderabad : హైదరాబాద్లో దారుణం.. బాలికపై మేనమామ అత్యాచారం
హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న బాలికపై సొంత మేనమామ అత్యాచారానికి పాల్పడ్డాడు.
- Author : Prasad
Date : 20-12-2022 - 9:38 IST
Published By : Hashtagu Telugu Desk
హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న బాలికపై సొంత మేనమామ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిందని.. అప్పటి నుంచి ఆమె మామ ఆమెను పెంచుతున్నాడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. బాలిక మేనమామ ఇంట్లో కుటుంబ సభ్యులు లేని సమయంలో ఆమెపై అత్యాచారం చేసినట్లు అనుమానిస్తున్నారు. లైంగిక వేధింపులకు గురైన బాలిక ఎవరికి చెప్పకపోవడంతో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. బాలికను పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు.