Tragedy : దసరా పండగ వేళ ..విహార యాత్ర ..విషాదం నింపింది
తాళ్లరేవు మండలం గోపలంక వద్ద గోదావరిలో స్నానానికి (Godavari ) తణుకుకు చెందిన ఏడుగురు యువకులు దిగారు. ఈ క్రమంలో నలుగురు గల్లంతు కాగా.. మరో ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు
- By Sudheer Published Date - 04:14 PM, Sun - 22 October 23

దసరా సెలవులు వచ్చాయి..సెలవులను ఫుల్ గా ఎంజాయ్ చేయాలనీ భావించిన ఆ స్నేహితులు..చివరికి విషాదంలో మునిగారు. విహార యాత్ర కాస్త ఆ కుటుంబాల్లో విషాదం నింపింది. సరదాగా ఈత కొడతామని గోదావరిలో దిగిన నలుగురు స్నేహితులు చివరికి మృతదేహాలుగా బయటకు రావడం విషాదం నింపింది. ఈ ఘటన కాకినాడ జిల్లా (Kakinada District) తాళ్లరేవు మండలం గోపులంక వద్ద చోటుచేసుకుంది.
We’re now on WhatsApp. Click to Join.
వివరాల్లోకి వెళ్తే..
నిన్న శనివారం తాళ్లరేవు మండలం గోపలంక వద్ద గోదావరిలో స్నానానికి (Godavari ) తణుకుకు చెందిన ఏడుగురు యువకులు దిగారు. ఈ క్రమంలో నలుగురు గల్లంతు కాగా.. మరో ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన వారిని తిరుమల రవితేజ(20), పెండ్యాల బాలాజీ(21), అనుమకొండ కార్తీక్(21), ముద్దన పనేంద్రి గణేష్(22)గా గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గోదావరిలో గాలింపు చేపట్టారు. రాత్రి వరకు మృతదేహాల కోసం పోలీస్, ఫైర్, రెవెన్యూ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు(Family members) తణుకు నుంచి గోపలంక గోదావరి ఒడ్డుకు చేరుకున్నారు. మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించడం అక్కడున్నవారిని కంటతడి పెట్టించింది.
Read Also : Thummala : రాష్ట్రం నుంచి అరాచకశక్తులను తరిమికొట్టాలని తుమ్మల పిలుపు