Roja : తన సోషల్ మీడియా ఖాతాల్లో నుంచి వైసీపీ పేరును తొలగించిన మాజీ మంత్రి రోజా
వైసీపీ ఫోటోలు, జగన్ అనే పేర్లు బొమ్మలు లేకుండా తొలగించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇలాంటి నిర్ణయం రోజా ఎందుకు తీసుకుందో అంటూ అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
- Author : Latha Suma
Date : 27-08-2024 - 4:33 IST
Published By : Hashtagu Telugu Desk
Roja: ప్రముఖ సీనియర్ హీరోయిన్, మాజీ మంత్రి, వైసీపీ నేత రోజా తన సోషల్ మీడియా ఖాతాల నుంచి వైసీపీ, జగన్ అనే పేర్లు, బొమ్మలు లేకుండా తీసేశారు. హఠాత్తుగా ఆమె ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో కానీ.. వైసీపీ వర్గాలు మాత్రం ఏదో ఉందని అనుకుంటున్నాయి. రోజా సోషల్ మీడియా హెడర్‌లో వైసీపీ ఆనవాళ్లు లేవు. బయోలో తాను వైసీపీ నాయకురాలినని చెప్పుకోవడానికి కూడా రోజా ఇష్టపడలేదు. నగరి ఇన్‌ఛార్జ్‌గా రోజా ఉన్నారా లేదా అన్నదానిపై స్పష్టత కావాలని ఆమె అడిగినట్లుగా తెలుస్తోంది.
We’re now on WhatsApp. Click to Join.
జగన్‌కు మాజీ మంత్రి రోజా బైబై చెప్పి.. తమిళ రాజకీయాల్లో చేరే అవకాశముందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తు్న్న మాట. తమిళ హీరో విజయ్ రాజకీయ అరంగేట్రం చేశారు. తమిళగ వెట్రి కళగం.. టీఎంకే పార్టీ ఏర్పాటు చేసి జెండాను ఆవిష్కరించారు. పార్టీ గీతాన్ని విడుదల చేశారు. ఇప్పుడు రోజా టీఎంకే పార్టీలో చేరే అవకాశం ఉందని టాక్. ఆమె భర్త సెవ్వమణి తమిళ సినీ దర్శకుడు. రోజా కూడా తమిళ సినిమాల్లో నటించారు. దీంతో తమిళనాడులో రాజకీయ అరంగేట్రం చేసేందుకు ఆమె రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. అందుకు తనకు అనుకూలమైన నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుని.. అక్కడకు మాకాం మార్చుకునే పనిలో ఉన్నారని తెలియ వచ్చింది. రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తోన్నారు. ఇది కాస్తా- వైసీపీలో చర్చనీయాంశమౌతోంది. ఆమె ఎక్కువ రోజులు పార్టీలో కొనసాగకపోవచ్చనే అభిప్రాయాలకూ తెర తీసినట్టయింది. దీనిపై రోజుకో చర్చ నడుస్తోంది.
మరోవైపు 2029 ఎన్నికల్లో రోజాకు వైసీపీ టికెట్ ఇవ్వకపోవ్చని టాక్. పార్టీతోపాటు ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా.. 2024 ఎన్నికల్లో వైసీపీ హైకమాండ్‌ను సెంటిమెంట్‌తోపాటు ఎమోషనల్‌గా బ్లాక్ మెయిల్ చేసి టిక్కెట్ తెచ్చుకున్నారట. బెదిరించి సీటు తెచ్చుకున్నా.. గెలవలేదు. మరో పార్టీలో చేరదామనుకున్నా అవకాశం లేదు. ఏపీసీసీ చీష్ షర్మిలను నోటికొచ్చినట్లు తిట్టారు. టీడీపీ, జనసేన, బీజేపీ అధినేతలపై కూడా నోరుపారేసుకున్నారు. దీంతో కూటమి పార్టీలోచేరేందుకు దారులన్నీ మూసుకుపోయాయి. ఇక తమిళనాడు రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారట.
Read Also: Modi Call To Putin: యుద్ధం ఆపాలని పుతిన్‌కి మోడీ ఫోన్