HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Former Chief Minister Ys Jagan Receives Birthday Wishes From Cm Chandrababu And Governor

Happy Birthday YS Jagan: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, గవర్నర్

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను పార్టీ శ్రేణులు భారీగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

  • Author : Vamsi Chowdary Korata Date : 21-12-2024 - 11:56 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Happy Birthday Ys Jagan Mohan Reddy
Happy Birthday Ys Jagan Mohan Reddy

Happy Birthday YS Jagan: వైసీపీ అధినేత వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పార్టీ శ్రేణులు ఈ వేడుకలను ఒక పండగల చేస్తున్నారు. వైసీపీ నాయకులు మరియు కార్యకర్తలు జన్మదినం సందర్బంగా కేక్ లను కట్ చేసి తమ ప్రేమాభిమానాలను వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్ధుల్ నజీర్ ట్వీట్:

రాష్ట్ర గవర్నర్ అబ్ధుల్ నజీర్, వైఎస్ జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ట్వీట్‌లో, “దేవుడు మీకు మంచి ఆరోగ్యం, సంతోషం, దీర్ఘాయుష్షు కలిగించాలని మరియు ప్రజాసేవలో సుదీర్ఘ కాలం కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను” అని పేర్కొన్నారు.

"I extend my heartiest felicitations and warm greetings to Sri Y.S. Jagan Mohan Reddy, former Chief Minister on his Birthday. May God Almighty bless you with good health, happiness and long life in the service of the people."@ysjagan pic.twitter.com/gc7M3EZg45

— governorap (@governorap) December 21, 2024

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్వీట్:

మరోవైపు, వైఎస్ జగన్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. “బర్త్ డే గ్రీటింగ్స్ టూ వైఎస్ జగన్ గారూ” అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. ఆయన మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు పొందాలని ఆకాంక్షించారు. చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే, గత ఏడాది కూడా జగన్ పుట్టిన రోజు సందర్భంగా చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేసిన సంగతి తెలిసిందే.

Warm birthday greetings to @ysjagan Garu. May he be blessed with good health and long life.

— N Chandrababu Naidu (@ncbn) December 21, 2024

మరోవైపు, రాష్ట్రంలోని పట్టణాలు, జిల్లాలు, మండల కేంద్రాల్లో వైసీపీ నేతలు జగన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. పలు చోట్ల రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి, వృద్ధులకు, రోగులకు పండ్లు పంపిణీ చేస్తున్నారు. ఇదే కాకుండా, జగన్ కు శుభాకాంక్షలు తెలిపేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ హోరెత్తిస్తున్నారు. #HBDYSJagan అనే హ్యాష్‌ట్యాగ్‌తో తెగ పోస్టులు వేస్తూ, ప్రస్తుతం ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్నాయి.

ఇక, వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా ప్రొద్దుటూరు రామేశ్వరంలోని శ్రీ హనుమత్ లింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు మాజీ శాసనసభ్యులు, వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మరియు ఇతర పార్టీ నేతలు పాల్గొన్నారు.

ఇక, ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో వైయస్ఆర్ సీపీ శ్రేణులతో కలిసి దేవినేని అవినాష్ పుట్టినరోజు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా, “ఆటు పోట్లను అవలీలగా ఎదుర్కోగల ‘ధీరుడికి’ జన్మదిన శుభాకాంక్షలు” అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. అలాగే, మాజీ మంత్రి రోజా కూడా వైఎస్ జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదినేత శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్బంగా ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన జిల్లా అద్యక్షులు దేవినేని అవినాష్ గారు..#AvinashForVijayawadaEast… pic.twitter.com/qqPmUvpM1v

— Devineni Avinash (@DevineniAvi) December 21, 2024

ఆటు పోట్లను అవలీలగా ఎదుర్కోగల "ధీరుడికి" జన్మదిన శుభాకాంక్షలు !@ysjagan

— Ambati Rambabu (@AmbatiRambabu) December 20, 2024


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • #HBDYSJagan
  • AP Governor Tweet On Jagan Birthday
  • CM Chandrababu Tweet on Jagan Birthday
  • Happy Birthday YS Jagan
  • ys jagan
  • YS Jagan Birthday
  • YS Jagan Birthday Celebrations
  • YS Jagan Mohan Reddy

Related News

Chandrababu Naidu

Chandrababu Naidu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

చిత్తూరు జిల్లా కండ్రిగలో జరిగిన సంజీవని ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 11 విషయాలు చెబుతానంటూ గత ప్రభుత్వ హయాంలో జరిగిన 11 అరాచక, విధ్వంసకర ఘటనలను ఏకరువు పెట్టారు. ఈ నిర్వాకాల వల్లే వైసీపీని తాను ‘గొడ్డలి పార్టీ’ అని పిలుస్తున్నానని, ఆ పార్టీ ముమ్మాటికీ గొడ్డలి పార్టీనేనని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో గొడ్డలి పార్

  • Atchannaidu fires on ys Jagan

    Atchannaidu: జగన్ పై అచ్చెన్నాయుడు ఫైర్

  • Jagan has lost his mind Balineni Srinivasa Reddy

    Balineni Srinivasa Reddy: జగన్ కి మైండ్ దొబ్బింది : బాలినేని

Latest News

  • NTR : అమీర్‌పేట్ చౌరస్తాలో నేడు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. ముఖ్య అతిధిగా సీఎం రేవంత్ రెడ్డి

  • NTR : ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘాట్ వద్ద నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్

  • Hawala Cash : దేవగిరి ఎక్స్‌ప్రెస్‌లో భారీ నగదు పట్టివేత.. హ‌వాలా డ‌బ్బుగా పోలీసుల అనుమానాం

  • IPL 2026 : సూర్యవంశీ విధ్యంసం.. క్వాలిఫయర్-2లోకి దూసుకెళ్లిన రాజస్థాన్ రాయల్స్

  • BYST : ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

    • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd