TDP : ఎన్నికల తరువాత నిరుద్యోగిగా మారే సజ్జల కొడుక్కి 3వేలు నిరుద్యోగభృతి ఇస్తాం – టీడీపీ నేత ధూళిపాళ్ల
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఫైర్ అయ్యారు.టీడీపీ పథకాలపై
- Author : Prasad
Date : 22-11-2023 - 7:24 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఫైర్ అయ్యారు.టీడీపీ పథకాలపై ప్రచారం నిబంధనలకు విరుద్దం ఎలా అవుతుందో హాఫ్ నాలెడ్జ్ సలహాదారు సజ్జల చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల తరువాత నిరుద్యోగిగా మారే సజ్జల కొడుక్కీ యువగళం కింద నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని ధూళిపాళ్ళ నరేంద్ర తెలిపారు. బాబు ష్యూరిటీ భవిష్యత్ కు గ్యారెంటీ పై తమ పార్టీ ఇంటింటి ప్రచారంతో జగన్ అండ్ కో కు భయం పట్టుకున్నట్లు ఉందన్నారు. మ్యానిఫెస్టో ద్వారా ప్రజలకు ఏం చేస్తామో చెపుతూ తాము గ్రామ గ్రామాన తిరుగుతుంటే వైసీపీకి వచ్చిన నొప్పేంటి అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల హామీల పై ప్రచారం నిబంధనల ఉల్లంఘన ఎలా అవుతుంది? వైసీపీలో ఉన్న ఓటమి ఫ్రస్టేషన్ అంతా హాఫ్ నాలెడ్జ్ ఫెలో, క్యాంప్ ఆఫీస్ సీనియర్ క్లర్క్ సజ్జల లో కనిపిస్తోందన్నారు.రేపు తాము అధికారంలోకి రావడం ఖాయమని.. సజ్జల, ఆయన కుమారుడి ఉద్యోగాలు ఊడి నిరుద్యోగులు అవ్వడం ఖాయమన్నారు. ఎటువంటి వివక్ష లేకుండా సజ్జల కుటుంబానికి బాబు ష్యూరిటీ పథకాలు అందజేస్తామని ఆయన ఎద్దేవా చేశారు.
Also Read: Chandrababu : చంద్రబాబు బెయిల్ తో ఏపీ రాజకీయం మారనుందా?