YSRCP : ఏపీకి మేలు జరగాలంటే జగన్ మళ్లీ సీఎం కావాలి – మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్
ఏపీ అభివృద్ధి జరగాలంటే సీఎంగా మళ్లీ జగన్ రావాలని మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కి
- By Prasad Published Date - 10:25 AM, Sat - 7 October 23

ఏపీ అభివృద్ధి జరగాలంటే సీఎంగా మళ్లీ జగన్ రావాలని మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కి మేలు జరగాలంటే జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని తెలిపారు. శుక్రవారం సార్వకోటలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో కృష్ణదాస్ మాట్లాడుతూ సంక్షేమ పథకాలు కొనసాగడంతోపాటు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి జరగాలంటే జగన్‌ని సీఎం చేయాలని ప్రజలను కోరారు. గ్రామ వాలంటీర్లు ప్రతి ఇంటి తలుపు తట్టి నాలుగేళ్లలో చేపట్టిన పలు సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయాలని కోరారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పనితీరును గత టీడీపీ ప్రభుత్వంతో పోల్చి ప్రజలకు వివరించాలని తెలిపారు. వాలంటీర్ వ్యవస్థపై జగన్ మోహన్‌రెడ్డికి పూర్తి విశ్వాసం ఉందని కృష్ణదాస్ సమావేశంలో చెప్పారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలపై వాలంటీర్లు ప్రచారం చేయాలని వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ జోనల్ ఇన్‌చార్జి డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్య తెలిపారు. వచ్చే ఆరు నెలలు పార్టీకి చాలా కీలకమని అన్నారు. ఎన్నికల సమీపిస్తున్నందును కార్యకర్తలు, నాయకులు కష్టపడాలని పిలుపునిచ్చారు
Also Read: Singapore: సింగపూర్‌లో కరోనా కొత్త వేరియంట్.. దేశ ప్రజలకు వార్నింగ్ ఇచ్చిన ఆరోగ్య మంత్రి