HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ex Minister Balineni Srinivasa Reddy Resigns Ycp

Balineni Srinivasa Reddy: వైసీపీకి ఝ‌ల‌క్ ఇచ్చిన బాలినేని.. పార్టీకి రాజీనామా..!

తాజాగా వైసీపీకి రాజీనామా చేసిన బాలినేని.. రేపు (గురువారం) ఉప ముఖ్య‌మంత్రి పవన్ కల్యాణ్‌తో భేటీ కానున్నట్లు సమాచారం అందుతోంది. ఒంగోలు ఎమ్మెల్యేగా బాలినేని ఐదుసార్లు గెలిచారు.

  • Author : Gopi Date : 18-09-2024 - 5:17 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Balineni Srinivasa Reddy
Balineni Srinivasa Reddy

Balineni Srinivasa Reddy: వైసీపీ అధినేత జగన్‌కు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy) ఝలక్ ఇచ్చారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. జగన్‌కు రాజీనామా లేఖను పంపినట్లు పేర్కొన్నారు. కొద్దిరోజులుగా పార్టీలో తనకు అవమానం జరుగుతుందని ఆయన అసంతృప్తితో ఉన్నారు. ఇటీవలే ఆయనను బుజ్జగించేందుకు మాజీ మంత్రి విడదల రజనిని జగన్ రంగంలోకి దింపినప్పటికీ.. ఆ ప్రయత్నాలు ఫలించలేదు. అంతేకాకుండా తాజాగా జ‌గ‌న్‌తో జ‌రిగిన చ‌ర్చ‌లు కూడా విఫ‌లం కావ‌డంతో బాలినేని వైసీపీకి రాజీనామా చేసిన‌ట్లు తెలుస్తోంది.

రేపు ప‌వ‌న్‌తో భేటీ.. జ‌న‌సేన‌లోకి బాలినేని?

ఈ క్ర‌మంలోనే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రేపు జనసేన తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. తాజాగా వైసీపీకి రాజీనామా చేసిన బాలినేని.. రేపు (గురువారం) ఉప ముఖ్య‌మంత్రి పవన్ కల్యాణ్‌తో భేటీ కానున్నట్లు సమాచారం అందుతోంది. ఒంగోలు ఎమ్మెల్యేగా బాలినేని ఐదుసార్లు గెలిచారు. జిల్లాలో రాజకీయంగా తిరుగులేని ఆధిపత్యాన్ని ఆయన చలాయించారు. వైసీపీలో చేరిన తర్వాత ఆయనను వివాదాలు చుట్టుముట్టాయి. దీంతో వైసీపీ నుంచి ఆయ‌న బ‌య‌ట‌కు రాక త‌ప్ప‌లేద‌ని బాలినేని వ‌ర్గాలు చెబుతున్నాయి.

Also Read: PF Withdraw: పీఎఫ్ రూల్స్ ఛేంజ్ చేసిన కేంద్రం.. మార్పులు ఏంటంటే..?

ఇక‌పోతే ఏపీలో వైసీపీ ప‌రిస్థితి దారుణంగా త‌యారవుతోంది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కేవ‌లం 11 ఎమ్మెల్యేలు, 4 ఎంపీ స్థానాల‌ను కైవ‌సం చేసుకున్న వైసీపీ క‌నీసం ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్కించుకోలేదు. వైసీపీకి ఇప్ప‌టికే ప‌లువురు కీల‌క నేత‌లు రాజ‌కీయ భ‌విష్య‌త్తు ప‌రంగా వైసీపీకి రాజీనామా చేస్తున్నారు. మ‌రోవైపు జ‌గ‌న్ కూడా పార్టీలో కీల‌క మార్పులు చేప‌ట్టారు. ఈ మార్పుల వ‌ల‌నే ఉన్న రాజ‌కీయ నాయ‌కులు కూడా అధికార పార్టీల వైపు చూస్తున్న‌ట్లు స‌మాచారం. మ‌రోవైపు ఎన్నిక‌లే ల‌క్ష్యంగా కూట‌మి ప్ర‌భుత్వంలోని జ‌న‌సేన పావులు క‌దుపుతోంది. అందుకోస‌మే సామాజిక వ‌ర్గాల‌ను, వారి ప‌నితీరును బ‌ట్టి పార్టీలో జాయిన్ చేసుకుంటుంది. బాలినేనితో పాటు మ‌రికొంత‌మంది నాయ‌కులు కూడా జ‌న‌సేన వైపు మొగ్గు చూపుతున్నట్లు స‌మాచారం. మున్ముందు ఇంకా ఎంత‌మంది వైసీపీకి షాక్ ఇస్తారో చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap politics
  • balineni srinivasa reddy
  • Deputy CM Pawan Kalyan
  • Janasena
  • YS Jagan Mohan Reddy
  • ysrcp

Related News

It is because of CM Chandrababu that it is not raining: Former Minister

Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి వల్లే రాష్ట్రంలో వర్షాలు పడటం లేదంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) సీనియర్ నేత, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. నంద్యాలలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాలు, వర్షాలు పడకపోవడానికి పాలకుల మనస్తత్వమే కారణమంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఏలుకునే రాజు మనస్తత్వం బాగుంటే

  • Big shock for YouTuber Ravan

    YouTuber Ravan : యూట్యూబర్‌ రావణ్‌పై ‘ఉపా’ చట్టం కింద కేసు నమోదు

  • Capital war reignites in AP... Amaravati versus Mavigan...

    Capital War: ఏపీలో మళ్లీ క్యాపిటల్ వార్.. అమరావతి వర్సెస్ మావిగన్..

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Alcohol: మందు కొడితే మంచి నిద్ర వస్తుందా..? నిజమెంత?

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd