Ex IPS officer Vs Ex Army chief : మాజీ ఐపీఎస్ నాగేశ్వర రావు వర్సెస్ మాజీ ఆర్మీ చీఫ్.. ఆ ఘటనపై ట్వీట్ వార్
భారత ఆర్మీ మాజీ చీఫ్, మాజీ కేంద్ర మంత్రి వి.కె.సింగ్, మాజీ ఐపీఎస్ అధికారి ఎం.నాగేశ్వర రావు మధ్య ఈవిషయంలో వాగ్యుద్ధం(Ex IPS officer Vs Ex Army chief) నడుస్తోంది.
- Author : Pasha
Date : 24-09-2024 - 4:15 IST
Published By : Hashtagu Telugu Desk
Ex IPS officer Vs Ex Army chief :ఓ ఆర్మీ అధికారికి కాబోయే భార్యకు ఇటీవలే ఒడిశాలోని భరత్ పూర్ పోలీసు స్టేషన్‌లో అవమానం జరిగింది. ఏకంగా పోలీసు సిబ్బందే ఆమెపై లైంగిక వేధింపులకు యత్నించారు. ఈ వార్త యావత్ దేశంలో కలకలం క్రియేట్ చేసింది. తాజాగా ఈ పరిణామం మరో మలుపు తీసుకుంది. భారత ఆర్మీ మాజీ చీఫ్, మాజీ కేంద్ర మంత్రి వి.కె.సింగ్, మాజీ ఐపీఎస్ అధికారి ఎం.నాగేశ్వర రావు మధ్య ఈవిషయంలో వాగ్యుద్ధం(Ex IPS officer Vs Ex Army chief) నడుస్తోంది.
Also Read :CM Revanth Reddy : ఓటుకు నోటు కేసు..సీఎం రేవంత్ రెడ్డికి నాంపల్లి కోర్టు ఆదేశం
‘‘ఈ ఘటన విషయంలో ఒడిశా పోలీసుల తప్పేం లేదు. అయినా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఒకప్పుడు ఆర్మీ చీఫ్‌గా, కేంద్రమంత్రిగా పనిచేసిన మీ లాంటి వాళ్లు కూడా పోలీసులను తప్పుపడితే ఎలా.. వాళ్లు ఎలాంటి తప్పు కూడా చేయలేదు’’ అని మాజీ ఐపీఎస్ అధికారి ఎం.నాగేశ్వర రావు పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. మాజీ ఆర్మీ చీఫ్ వి.కె.సింగ్ కామెంట్స్‌ను కౌంటర్ చేస్తూ ఈ వ్యాఖ్యలను నాగేశ్వరరావు చేశారు. ఇంతకీ వీకే సింగ్ ఏమన్నారంటే.. ‘‘ఆర్మీ అధికారి కాబోయే భార్యకు ఒడిశాలో ఎదురైన వేధింపులు ఘోరాతి ఘోరం. పోలీసు యూనిఫాంలో తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్న నిందితులను గుర్తించి వెంటనే శిక్షించాలి. షేమ్ ఆన్ ఒడిశా పోలీస్’’ అని పేర్కొన్నారు. పోలీసులను షేమ్ అంటూ వీకే సింగ్ చేసిన వ్యాఖ్యలకు రిప్లై ఇస్తూ.. మాజీ ఐపీఎస్ అధికారి నాగేశ్వరరావు పై కామెంట్స్ చేశారు.
Also Read :Tirumala Laddu Issue : పవన్… నా ట్వీట్ మరోసారి చదివి మాట్లాడు – ప్రకాష్ రాజ్ కౌంటర్
నాగేశ్వరరావు ఇంకా ఏమన్నారంటే.. ‘‘ఒక ఆర్మీ అధికారికి కాబోయే భార్య భువనేశ్వర్ నగరంలో 10 పెగ్గుల మద్యం తాగింది. ఆ మత్తులోనే జోగుతూ అర్ధరాత్రి 2 గంటల టైంలో కారు నడిపింది. ఈక్రమంలో రాత్రి 2.30 గంటల టైంలో కొందరు ఇంజినీరింగ్ విద్యార్థులతో ఆమెకు గొడవ అవుతుంది. బాగా వాగ్వాదం జరిగిన తర్వాత ఇరుపక్షాలు కలిసి భరత్ పూర్ పోలీసు స్టేషనుకు చేరుకుంటారు. చివరకు పోలీసు స్టేషనులో కూడా గొడవపడతారు. దీంతో ఆ పోలీసు స్టేషన్ సిబ్బంది పోలీసు కంట్రోల్ రూంకు కాల్ చేసి తమకు సాయం కావాలని కోరుతారు. అనంతరం సదరు ఆర్మీ అధికారి కాబోయే భార్యను మెడికల్ టెస్టుల నిమిత్తం ఆస్పత్రికి రమ్మని పోలీసులు అడిగారు. అలా ఆస్పత్రికి తీసుకెళ్లడం తప్పేం కాదు. అది ఫార్మాలిటీ. అయితే పోలీసులు చెప్పిన మాటను ఆమె వినలేదు’’ అని వివరించారు. ‘‘ఒడిశాలో 600కుపైగా పోలీసు స్టేషన్లు ఉన్నాయి. ఈ స్టేషన్లలో ఏటా లక్షల దాకా కేసులు నమోదవుతున్నాయి. వాటిలో మహిళలు, ఆర్మీఅధికారుల కేసులు కూడా కొన్ని ఉంటాయి. అయితే ఈ కేసును భూతద్ధంలో చూపించాల్సిన అవసరం లేదు’’ అని నాగేశ్వర్ రావు తెలిపారు.