HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Enforcement Directorate Raids In Ap And Ts In Delhi Liquor Scam

Liquor Scam : `ఢిల్లీ లిక్క‌ర్` కిక్- ఏపీ,తెలంగాణాల్లో మ‌ళ్లీ ఈడీ దాడులు!

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని రాజ‌కీయాన్ని వేడెక్కించింది. ఇటీవ‌ల ఎమ్మెల్సీ క‌విత‌కు స‌న్నిహితులుగా ఉండే వాళ్లు కంపెనీలు, ఇళ్ల‌లో ఈడీ సోదాలు నిర్వ‌హించింది.

  • Author : CS Rao Date : 16-09-2022 - 1:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
KCR ED
Kcr Ed Liquor Scam

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని రాజ‌కీయాన్ని వేడెక్కించింది. ఇటీవ‌ల ఎమ్మెల్సీ క‌విత‌కు స‌న్నిహితులుగా ఉండే వాళ్లు కంపెనీలు, ఇళ్ల‌లో ఈడీ సోదాలు నిర్వ‌హించింది. తాజాగా మ‌ళ్లీ శుక్ర‌వారం తెలుగు రాష్ట్రాల‌తో పాటు ప‌లు చోట్ల ఈడీ దాడులు చేస్తోంది. ప్ర‌త్యేకించి నెల్లూరు కేంద్రంగా సోదాలు నిర్వ‌హించ‌డం టీడీపీ వ‌ర్గాలు చేసి ఆరోప‌ణ‌లు నిజం కాబోతున్నాయా? అనే కోణం నుంచి చ‌ర్చ జ‌రుగుతోంది.

గ‌త రెండు వారాలుగా సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌తీమ‌ణి భార‌తి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి క‌లిసి ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ వ్య‌వ‌హారాన్ని న‌డిపార‌ని టీడీపీ ఆరోపిస్తోంది. అందుకు సంబంధించిన కొన్ని ఆధారాల‌ను కూడా మీడియాకు చెప్ప‌డం తెలిసిందే. ఇప్పుడు అక‌స్మాత్తుగా నెల్లూరు కేంద్రంగా ఈడీ దాడులు నిర్వ‌హించ‌డం సంచ‌ల‌నం క‌లిగిస్తోంది. ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కు సంబంధించిన ఆధారాలు ఉన్నాయ‌ని బీజేపీ ఎంపీలు చెబుతున్నారు. అందుకు సంబంధించిన స్ట్రింగ్ ఆప‌రేష‌న్ తొలి వీడియోను గ‌త వారం విడుద‌ల చేశారు. తాజాగా మ‌రో వీడియోను విడుద‌ల చేయ‌డం స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది.

బిజెపి మాజీ ఎమ్మెల్యే మంజీందర్ సింగ్ సిర్సా ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో హైదరాబాద్ లింకులపై గతంలోనే సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత పాత్ర ఇందులో ఉందని ఆయన ఆరోపించారు. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. బిజెపి ఎంపి డాక్టర్ సుధాన్షు త్రివేది, ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా మరియు మంజీందర్ సింగ్ సిర్సా మద్యం విక్రయాల కాంట్రాక్టులకు సంబంధించి జ‌రిగిన అక్ర‌మాల‌ వీడియోలు ఉన్నాయ‌ని చెబుతున్నారు. ఢిల్లీ ప్రభుత్వం మద్యం పాలసీని మార్చడం ద్వారా కోట్లాది రూపాయలను దోచుకున్నార‌ని ఎంపీ డాక్టర్ హర్షవర్ధన్, ఇతర బీజేపీ ఎంపీలు రమేష్ బిధూరి, ప్రవేశ్ సాహిబ్ సింగ్, హన్సరాజ్ హన్స్ ఆరోపిస్తున్నారు.

ఢిల్లీ ప్రభుత్వం చిన్న వ్యాపారులను ఎక్సైజ్ పాలసీ నుండి దూరంగా ఉంచింది. ఇక్క‌డే స్కామ్ కు బీజం ప‌డిందని బీజేపీ లీడ‌ర్లు చెబుతున్నారు. లిక్కర్ కుంభకోణంలో హైదరాబాద్ నుంచి ఎవరెవరు ఢిల్లీకి వచ్చారు? ఎవరెవరిని కలిశారు? ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వెళ్లి ఎవరెవరు ఎప్పుడు ఎవరెవరిని కలిశారు? త‌దిత‌ర ఆధారాలు ఉన్నాయని బీజేపీ ఢిల్లీ విభాగం చెబుతోంది. ఈ ఆధారాలను కోర్టుకు అందించ‌డానికి సిద్ధం అవుతోంది. దీంతో ఎవ‌రి పేరు ఎప్పుడు బ‌య‌ట‌కు వ‌స్తుందోన‌ని తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీ లీడ‌ర్ల‌లో ఉత్కంఠ నెల‌కొంది.

శుక్ర‌వారం ఐదు రాష్ట్రాల్లోని 40 లొకేషన్లలో ఒకేసారి సోదాలను నిర్వహిస్తోంది. హైదరాబాదులోనే 20 చోట్ల సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఏపీలోని నెల్లూరుతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీలో కూడా సోదాలు జరుగుతున్నాయి. లిక్కర్ బిజినెస్ వ్యాపారులు, డిస్ట్రిబ్యూటర్లు, సప్లై చైన్ నెట్ వర్క్ లే లక్ష్యంగా దాడులు. కొనసాగుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఈడీ దాడులు మూడు వారాల వ్య‌వ‌ధిలో రెండోసారి కూడా జ‌ర‌గ‌డం కావడం గమనార్హం. గత వారం ఢిల్లీ, తెలంగాణ, మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరప్రదేశ్, కర్ణాటకల్లో సోదాలను నిర్వహించింది. అప్పుడు ఏపీలో సోదాలకు దూరంగా ఉన్న‌ ఈడీ ఈసారి నెల్లూరులో సోదాలు నిర్వహిస్తుండటం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశం అయింది.

గోవా, పంజాబ్‌లో ఎన్నికల కోసం 100 కోట్ల రూపాయలను మద్యం దిగ్గజాలు ఆప్‌కి నగదు రూపంలో ఇచ్చారని బిజెపి ప్రసారం చేసిన స్టింగ్ వీడియో పేర్కొంది. గ‌తంలో రూ. 10 లక్షలకు ఇచ్చిన లైసెన్స్ ఏకంగా రూ. 5 కోట్ల వరకు పెంచడం వెనుక పెద్ద క‌థ న‌డిచింది. బీజేపీ` స్టింగ్ టేప్‌`లో ఎక్సైజ్ పాలసీ స్కామ్‌లో నిందితులలో ఒకరైన అమిత్ అరోరా ఉన్నారు. ఆమ్ ఆద్మీ ప్రభుత్వం లైసెన్స్‌ల కోసం భారీ కమీషన్ తీసుకుంద‌ని ఆరోప‌ణ‌. ఆ డబ్బును పంజాబ్ , గోవా ఎన్నికలకు ఉపయోగించిందని అమిత్ అరోరా పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

ఢిల్లీ టూ హైద‌రాబాద్ వ‌యా నెల్లూరు చుట్టూ లిక్క‌ర్ స్కామ్ వ్య‌వ‌హారం న‌డుస్తోంది. దీంతో విప‌క్ష పార్టీలు మ‌రోసారి ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌తీమ‌ణి భార‌తి, విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌మేయాన్ని అనుమాస్తున్నాయి. స్కామ్ కు సంబంధించిన న్యూస్ లో పేరు రాకుండా క‌విత కోర్టుల నుంచి ఉత్త‌ర్వులు తీసుకొచ్చారు. అదే బాట‌న భార‌తి, విజ‌య‌సాయిరెడ్డి కూడా న‌డుస్తామ‌ని టీడీపీ చేస్తోన్న ఆరోప‌ణ‌. నెల్లూరులో ఈడీ చేస్తోన్న దాడుల‌తో మొత్తం వ్య‌వ‌హారం బ‌య‌ట‌కు రానుంద‌ని టీడీపీ ఎదురుచూస్తోంది. కానీ, తొలి విడ‌త ఏపీని వ‌దిలేసిన ఈడీ రెండోసారి దాడుల్లో ఎంట్రీ ఇవ్వ‌డం కొన్ని అనుమానాల‌ను క‌లిగిస్తోంది. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ పెద్ద దుమారాన్నే రేపుతోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • aam admi party
  • Delhi Liquor scam
  • kalvakuntla kavitha
  • Manish Sisodia

Related News

Kavitha warns the Congress government.

Kavitha: కాంగ్రెస్ ప్రభుత్వానికి కవిత వార్నింగ్

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని సింగరేణి జేవీఆర్ ఓపెన్ కాస్ట్ (JVR OC) గని వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బిఆర్ఎస్ నాయకురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన సింగరేణి ‘బాయిబాట’ ముగింపు కార్యక్రమం సందర్భంగా ఈ హైడ్రామా చోటుచేసుకుంది. భద్రతా కారణాల దృష్ట్యా కవితను గని లోపలికి అనుమతించలేమంటూ సింగరేణి అధికారులు, పోలీసులు ఆమెను గేటు వద్దే అడ్డుకున్న

  • Delhi High Court deals a blow to Kavitha.

    kalvakuntla kavitha: కవితకు ఢిల్లీ హైకోర్టు షాక్

Latest News

  • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

  • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

  • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

  • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

  • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd