Jagan Politics: ఎన్నికల పావు ఉత్తరాంధ్ర, జగన్ గ్రాఫ్ అక్కడే డల్
కాంగ్రెస్స్ సాంప్రదాయ ఓటు బ్యాంకు మైనారిటీ మతాలు,
- By CS Rao Published Date - 12:15 PM, Sun - 26 February 23

కాంగ్రెస్స్ సాంప్రదాయ ఓటు బ్యాంకు మైనారిటీ మతాలు, రెడ్డి, ఎస్సీ, ఎస్టీ కులాలు. అవి 2019 ఎన్నికల్లో జగంతో పాటు నడిచాయి. కానీ బిసిలు, కాపులు, ఇతర అగ్ర కులాలు విభజన తరువాత అనుభవం అవసరమని చంద్రబాబు ను ఎన్నుకొన్నారు. దేశమే పోటీగా అభివృద్ధిని చేసి, సంక్షేమం కూడా అమలు చేస్తున్నా, కమ్మ కులం మీద, మిగిలిన కులాలలో ఒక విధమైన అసూయ ఏర్పడేలా ప్రశాంత్ కిశోర్ ఐప్యాక్ టీం పనిచేసింది.అటు కాపు రిజర్వేషన్ల మీద తుని రైలు దహనం, మరో వైపు బిసిల నాయకులతో కాపులకు రిజర్వేషన్లు ఇచ్చేస్తున్నాడహో అంటూ అప్పట్లో రెండు వైపులా పెట్రోల్ పోసింది వైకాపా ఐప్యాక్ టీం. చంద్రబాబు పాలనపై వ్యతిరేఖత లేదు. నాయకులు అలసత్వంతో కార్యకర్తలను పట్టించుకోలేదు. టీఆర్ఎస్, బిజెపి, ఆరెసెస్, జనసేన, వైకాపా ఒకే అజెండాతో పనిచేసింది చూసాం. కులాల కుంపట్లను రగల్చడానికి తెలంగాణా నుండి కూడా రప్పించడం, ఢిల్లీ పెద్దలను కలిసి పోలీసు అధికారులు కూడా కమ్మోళ్లే అని సాక్షాత్తు జగన్ రెడ్డి (Jagan Mohan Reddy) కలవడం, మధ్యలో కోడి కత్తి, చివర్లో బాబాయి గొడ్డలి మర్డర్ .. ఇలా ఎన్నో చేస్తే 2019లో అధికారం చేజిక్కింది.
ఆ సమయంలోనే కాపులకు రిజర్వేషన్ ఇచ్చేది లేదు అని తేల్చి చెప్పాడు జగన్. ఎందుకంటే ఆ ఓట్లు తనకు రావు. జనసేన టిడిపితో కలవడం లేదు కాబట్టి, అటు వెళుతుంది. బదులుగా బిసిల ఓట్లు వస్తాయని, కాపుల్లో శెట్టి బలిజలను చీల్చుకొంటే చాలని రాజకీయ వ్యూహం పన్ని, సఫలం అయ్యారు. అధికారం దక్కింది. ఇక ఇప్పుడు హోల్సేల్ గా ఆదాయం మొత్తం సెంట్రలైజ్ చేసుకోవలని, ఇసుక అమ్మకాలను నిషేధించి, మొత్తం ఒక కంపెనీ ద్వారా వచ్చేలా నెలల పాటు పాలసీలు మార్చి ప్రయోగాలు చేశారు. దాంతో రియల్ ఎస్టేట్ మరియు అనుభంధ రంగాలు సర్వనాశనం అయ్యింది. ఎక్కడికక్కడ మద్యం వేలాలు మాని, ప్రభుత్వ దుకాణాలు తెచ్చి, తమ బినామీ కంపెనీల బ్రాండ్లు మాత్రమే అమ్మేలా, అదీ అధిక ధరలు అమ్మేలా చేసుకొని, చెప్పిందే రేటు ఇచ్చిందే మద్యం అన్నట్లు, దాన్ని కూడా హోల్సేల్ ఆదాయం ఇచ్చేలా సెంట్రలైజ్ చేశాడు. ఇసుక మద్యం పార్టీ నాయకుడికి సెంట్రలైజ్డ్ అయినా కనీసం చేసుకోడానికి బిల్లు వచ్చే పనులు కూడా లేక, ఎక్కడికక్కడ స్థానికంగా నాటు సారా వ్యాపారాలకు కొందరు, పేకాట వ్యాపారాలకు కొందరు, గంజాయికి వ్యాపారానికి కొందరు, కబ్జాలకు మరికొందరు ఇలా తెగబడ్డారు.
దాని వలన సమాజంలో అరాచకం ప్రభలింది. గ్యాంగ్ రేపులు, మర్డర్లు నిత్యకృత్యం అయ్యాయి. కరోనాతో జనం బ్రతుకులు క్రుంగిపోగా.. జగన్ (Jagan Mohan Reddy) పాలనతో దుర్భరంగా మారడం మొదలయ్యింది. దీని తీక్షణత ప్రతి కులాన్ని ,మతాన్ని తాకింది. వైఎస్సార్ లా కాకున్నా.. కనీసం ఒక మాదిరిగా అయినా పాలిస్తాడు అనుకొన్న అంచనాలు దారుణంగా తలక్రిందులు అవ్వడం, దగ్గరకు రానివ్వకుండా చెయ్యడంతో ఖిన్నులు అయ్యారు. సొంత కులం అదీ పులివెందుల్లోనే, అడిగే జనానికి బదులివ్వలేక, వాడు మా వాడు కాదు అని మొహం తిప్పుకొనేలా తయారయ్యాయి పరిస్థితులు.
ఉద్యోగులు, కులవృత్తుల వారు అనే ముంది అన్ని రంగాల వారూ.. దారుణంగా మోసపోయాం అనే అంచనాకు వచ్చేశారు. అలా రావడానికి కారణం వుంది. ప్రధాన ప్రతిపక్షం టిడిపి, జగన్ ముందు చెప్పిన వీడియోలు త్రిప్పడంతో, అవే మాటలను విని జనం నవ్వుకోవడం, చేతల్లో చెయ్యను చేతకాని వాడు అని ముద్రపడ్డం, పైగా అల్జీమర్స్ లాంటి మతిమరుపో ఇంకొకటో, కొన్ని పదాలు గుర్తుకు రాక, మాట్లడితే అభాసుపాలయ్యేలా మాట్లాడకుండా మాట్లడలేడా అని వైకాపానే వణికేలా జగన్ రెడ్డి (Jagan Mohan Reddy) వింత పోకడలు మరింత చేటు తెచ్చాయి. ఆదాయం లేదు, అప్పులు, వడ్డీలు, పనుల తాలూకూ బిల్లులు గట్రా బిగుసుకుపోతున్నాయి. రోజులు గడిచే కొద్దీ ఓటమి అంత భయంకరంగా మారుతుంది అని ఒక అంచనాకు రావడం, దానిని జగన్ కు వివరించి ముందస్తు సన్నాహాలు చేసుకొని, మళ్లీ కులాల చిచ్చులను నమ్ముకోవడం చకచకా జరిగిపోయాయి.
ఈసారి ఓట్లను చీలకుండా చేస్తా అని పవన్ కల్యాణ్ ప్రకటించడంతో, అదే ఓటమికి బీజం అవుతుంది అని తెలియని అమాయకత్వం జగన్ లో లేదు. చిత్తూరు జిల్లాలో ఓ దళిత జడ్జీ మీద కేసులు పెట్టడం నుండి అటు ఉత్తరాంధ్రాలో ఎస్సీ డాక్టర్ చనిపోవడం వరకు కారణాలే కాకుండా, ఎక్కడికక్కడ ఇండ్ల స్థలాలకు ఎస్సీ అసైండ్ ల్యాండ్లను లాక్కోవడం గట్రా చెయ్యడం, సబ్ ప్లాను నిధులు పైసా ఖర్చుపెట్టలేక పోవడం.. అన్ని కులాలకు ఇచ్చే అమ్మఒడి, చిక్కూ, తప్ప తమకు ఏమి ప్రత్యేకంగా ఇచ్చింది వంచించడం తప్ప, పైగా శిరోముండనాలు, ఆట్రాసిటీ కేసులు కూడా దళితుల మీద పెట్టే పరాకాష్ట పాలనతో.. మహాసేన, హర్షకుమార్ తదితర నాయకులు బాహాటంగా విమర్శిస్తున్నా… చాపక్రింద నీరులా అంబేద్కర్ వాదులు, మేధావులు కూడా ఆత్మగౌరవం ఏది మనకు అని చర్చించుకొని ఒక అవగాహనకు వస్తున్న వేళ, ఎమ్మెల్సీ అనంత దళిత డ్రైవర్ని చంపి, వారి ఇంటి వద్ద వదిలిపెట్టడంతో, జగన్ (Jagan Mohan Reddy) మీద ఎస్సీ ఎస్టీలలో ఆగ్రహాలు పెరిగింది.
ఎస్సీ ఎస్టీల నుండి కనీసం 15% ఓట్లు పోయినా, అది 30% కు లెక్క వైకాపాకు. ఎందుకంటే దానికి పడే ఓట్లు టిడిపికి పడితే, ఇక్కడ మైనస్ అయ్యి అక్కడ ప్లస్ అవుతుంది. అలాజరిగితే ఈ ఒక్క ఛాన్స్ చివరి ఛాన్స్ అని తెలుసు. దింపుడుగల్లం ఆశలతో, కోనసీమ అంబేద్కర్ చిచ్చును ఎంచుకొన్నారు. కాపులను జనసేనకు పరిమితం చేసి, ఎస్సీ ఎస్టీలను తమకు లాక్కోవడం. దానికి అటూ ఇటూ రెండు వైపులా అచ్చొచ్చిన విద్యను ప్రయోగించారు. కానీ వికటించింది. దహనాల్లో బాహాటంగా దొరికిపోయిన వాళ్లతో సన్నిహితంగా దిగిన ఫోటోలు మీడియాలో, సోషల్ మీడియాలో దర్శనం ఇవ్వడంతో ఖంగుతిని, తమకు తామే అగ్గిపెట్టుకొంటామా అని వైకాపా మంత్రులంతా ముక్తకంఠంతో ఖడించుకొనే పరిస్థితులు దాపురించాయి.
ముందుకాలంలో వున్నట్లు అమాయకంగ నమ్ముతారు, మళ్లీ వంచించవచ్చు అనుకొంది వైకాపా. ఏ కులానికైన, ప్రస్తుత కాలంలో బతుకు ఖర్చులు ఒక్కటే. అందులో మేధావులు అన్నీ లెక్కలు తీసి చర్చలు చేస్తున్నారు. పైగా వెయ్యి దాటిన జగన్ సొంత సామాజిక వర్గ చాంతాడు లిస్టు ఎప్పటికప్పుడు రెడ్లకు పదవులు ఇచ్చినప్పుడల్లా అప్డేట్ చేసి సోషల్మీడియాలో వదులుతున్నారు. అదే అసూయ నేడు రెడ్ల మీద సమాజంలో. ప్రతి కులంలో దుర్భరమైన బతుకులకు కారణం జగన్ (Jagan Mohan Reddy) అనే ఆవేశం. గడప గడపలో ప్రతిబించేసరికి, బస్సు యాత్రకు మళ్లారు. సామాజిక న్యాయం చెయ్యబోతున్నాం అని ప్రజారాజ్యం అప్పుడు చిరంజీవి చెప్పిన పల్లవితో, మంత్రుల చేత బస్సు యాత్రలు మొదలెట్టారు. జనాన్ని వాలంటీర్లను వాడి బెదిరించి, నిర్భందించి తెచ్చి, మాకు జనం వస్తున్నారు అని వాపును చూపి నమ్మించడానికి మహా ప్రయాసపడుతోంది వైకాపా.
కులాలను వాడుకొంటే.. వాడుకొన్నారని తెలిసి మమ్మల్నే మోసం చేస్తారా అని ఆ కులాలు భావిస్తే.. జరిగే పరిణామాలు ఎలా వుంటాయో.. వైకాప రుచి చూడబోతోంది. విభజన జరిగే రోజు వరకు, తల్లి కాంగ్రెస్స్ కూడా క్షుద్ర రాజకీయం చేస్తూ విర్రవీగింది. అదే పరిస్థితి దాదాపుగా వైకాపాకు. ఏ మిరాకిల్ జరిగినా.. దానికి పరాభవం తప్పదు. నమ్మే వారు లేరు, ఆఖరికి రెడ్డి కులంలో కూడా. మనోడు అని ఊగిసలాటతో రాజకీయ ఆరాటం వున్నోళ్లు తప్ప భుజాల మీద మొయ్యరు. ఎన్నికలు సమీపించే కొద్దీ, ఒంగోలు వద్ద మహా జన సముద్రంలా కనిపిస్తున్న మహానాడుకు మించిన పరిస్థితులు సమీకరణాలు మారతాయి. ఎందుకంటే అనుభవం వున్న నాయుడు, గత పాలనలో తప్పు చెయ్యలేదు, పైగా ఎంతో బాగా చేశాడు, ఆయన తప్ప ప్రస్తుతం వేరే ఎవరూ కనిపించడం లేదు అని భావనకు జనం వచ్చేశారు. దాని నిదర్శనమే ఇటీవల కడపలో కూడా ఆయనకు జన నీరాజనం.
ఈ కోనసీమ కుట్ర వైకాపా టీజర్ మాత్రమే. అధికారం కోసం మరెన్నో దారుణాలకు పాల్పడుతుంది, తప్పకుండా. తన రాజకీయ అనుభవంలో నేర్చుకోనిది, జగన్ దగ్గర ఇవన్నీ చంద్రబాబు నేర్చుకొన్నాడు కాబట్టి, వైకాపా చేసే ప్రతి దుర్మార్గాన్ని, దాని మెడకే చుడతాడు. బీ కేర్ అంటూ మేధావులు ఒక అభిప్రాయానికి వస్తున్నారు.
Also Read: Muscle Strength: కండరాల బలం కోసం ఈ ఫుడ్స్ తినండి