HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Double Fines For Political Leaders Ap Home Minister Anita On Traffic Challans

Vangalapudi Anita: రాజకీయ నేతలకు రెట్టింపు ఫైన్.. ట్రాఫిక్ చలానాలపై ఏపీ హోంమంత్రి అనిత

  • Author : Vamsi Chowdary Korata Date : 06-05-2026 - 11:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ap Home Minister Vangalapud
Ap Home Minister Vangalapud

ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ట్రాఫిక్ నిబంధనల అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులు హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే రెట్టింపు జరిమానా విధించాలని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రోడ్డు భద్రత విషయంలో ఎవరికీ మినహాయింపులు ఉండవని, నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాలను అరికట్టగలమని ఆమె స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లాలో ‘సురక్షిత రోడ్లు.. సురక్షిత జీవితం’ నినాదంతో నిర్వహించిన బైక్ ర్యాలీలో ఆమె పాల్గొన్నారు.

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అడ్డరోడ్డు నుంచి నక్కపల్లి వరకు జరిగిన ఈ బైక్ ర్యాలీలో మంత్రి అనిత మాట్లాడుతూ, “లక్షల రూపాయలు పెట్టి బైక్ కొనేవారు, ప్రాణాలను కాపాడే వెయ్యి రూపాయల హెల్మెట్‌ను కొని ధరించడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో చాలా మంది హెల్మెట్ లేకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోయారు. ప్రాణం విలువను ప్రతి ఒక్కరూ గుర్తించాలి” అని అన్నారు.

ఈ సందర్భంగా తన పాయకరావుపేట నియోజకవర్గంలో జరిగిన రోడ్డు ప్రమాదాలను గుర్తుచేసుకుని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. “ప్రాణం కంటే విలువైనది ఏదీ లేదు. మన నియోజకవర్గంలో ఒకే నెలలో జరిగిన రోడ్డు ప్రమాదాలు ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశాయి. ఇకనైనా మేల్కొని ‘హెల్మెట్ ధరిద్దాం – సురక్షితంగా పయనిద్దాం’ అనే నినాదాన్ని పాటిద్దాం. మన ప్రాణాలను, మన కుటుంబాల భవిష్యత్తును కాపాడుకుందాం” అని అనిత పిలుపునిచ్చారు. ర్యాలీలో భాగంగా ఆమె పలువురు వాహనదారులకు స్వయంగా హెల్మెట్లు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించి, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరాలని కోరారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh government
  • ap home minister
  • AP Traffic Police
  • Double Fine
  • new traffic rules
  • road accidents
  • Road Safety
  • Vangalapudi Anita
  • vangalapudi anitha

Related News

    Latest News

    • TVK: టీవీకే పార్టీలోకి 35 మంది ఎమ్మెల్యేలు

    • Gold Price: ఒక్కసారిగా మారిన బంగారం వెండి ధరలు

    • Vangalapudi Anita: రాజకీయ నేతలకు రెట్టింపు ఫైన్.. ట్రాఫిక్ చలానాలపై ఏపీ హోంమంత్రి అనిత

    • Shashi Tharoor: మోదీ, షా వ్యూహం భేష్.. మనం ఆత్మపరిశీలన చేసుకోవాలన్న శశి థరూర్

    • AIADMK: తమిళ్ పాలిటిక్స్‎లో బిగ్ ట్విస్ట్.. అన్నాడీఎంకే లో రగడ

    Trending News

      • TVK Vijay Trisha: ఎమ్మెల్యేగా త్రిష అక్కడ నుంచే పోటీ..?

      • మీ మొబైల్‌ ఫోన్లలో పెద్ద సైరన్ మెసేజ్ వచ్చిందా.. భయపడవద్దని కేంద్రం సూచన

      • ప్రపంచ రికార్డుకు కేవలం ఒక సిక్స్ దూరంలో వైభ‌వ్ సూర్య‌వంశీ!

      • ట్రంప్‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారా? జెడి వాన్స్ ఆందోళ‌న‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd