HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Differences Between Jagan And Bharti Bjp Mla Is Agitated

Jagan- Bharati: జ‌గ‌న్‌- భార‌తి మ‌ధ్య విభేదాలు.. బీజేపీ ఎమ్మెల్యే సంచ‌ల‌నం!

విజ‌య‌సాయి రెడ్డి రాజీనామా, వైసీపీ పార్టీపై ప్ర‌భుత్వ విప్‌, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

  • Author : Gopi Date : 26-01-2025 - 2:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jagan- Bharati
Jagan- Bharati

Jagan- Bharati: ఏపీలో రాజ‌కీయాలు శ‌ర‌వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష పార్టీగా ఉన్న వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. జ‌గ‌న్ (Jagan- Bharati) విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న స‌మ‌యంలోనే వైసీపీకి ఊహించ‌ని భారీ షాక్‌లు ఎదుర‌య్యాయి. అందులో ముఖ్యంగా విజ‌య‌సాయి రెడ్డి రాజీనామా. వైసీపీ రాజ్య‌స‌భ ప‌ద‌వికి, అదే విధంగా వైసీపీకి రాజీనామా చేస్తున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. ఇక‌పై వ్య‌వ‌సాయం చేస్తూ మిగిలిన జీవితాన్ని గ‌డిపేస్తాన‌ని ఆయ‌న పేర్కొన్నారు. అయితే వైసీపీ ఆవిర్భావం నుంచి జ‌గ‌న్ త‌ర్వాత అన్ని తానై వ్య‌వ‌హారించిన విజ‌య‌సాయి రెడ్డి ఇలా స‌డెన్‌గా రాజ‌కీయ రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌డంపై ఏపీ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

తాజాగా విజ‌య‌సాయి రెడ్డి రాజీనామా, వైసీపీ పార్టీపై ప్ర‌భుత్వ విప్‌, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. A1 అయిన జ‌గ‌న్‌కు, A2 అయిన సాయిరెడ్డికి మధ్య‌ విభేదాలు ఎందుకు వచ్చాయని ప్ర‌శ్నించారు. విజ‌య‌సాయి రెడ్డి తప్పించుకోలేని త‌ప్పులు చేశారని ఎమ్మెల్యే ఆరోప‌ణ‌లు చేశారు. వైసీపీ అడుగు ద‌శ‌కు చేరింద‌ని, వైఎస్ఆర్‌ డైనోసార్ అని జగన్ సార్ బేకార్ అని ఎద్దేవా చేశారు. పులివెందులలో డీఎస్పీ మురళీ నాయక్‌ను జగన్ బెదిరించాడని అన్నారు.

Also Read: Unified Pension Scheme: బడ్జెట్‌కు ముందే కీల‌క నిర్ణయం.. ఏప్రిల్ 1 నుండి UPS అమలు!

విజయసాయి రెడ్డి వైసీపీ నుంచి బయటకు వచ్చినందుకు హృదయపూర్వకంగా అభినందిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. జ‌గ‌న్ లాంటి ద‌రిద్రుడు నుంచి దూరంగా ఉండాల‌ని, వైసీపీ లాంటి పార్టీ ఉండకూడదని ఆదినారాయ‌ణ రెడ్డి అన్నారు. వివేకా హత్యపై విజయసాయిరెడ్డి నిజం చెప్పారన్నారు. విజయసాయి రెడ్డితో అవినాష్ గుండెపోటు అని చెప్పించాడని ప్ర‌భుత్వ విప్ ఆరోపించారు. జగన్ రెప్పకు దెబ్బతగిలితే హత్యా ప్రయత్నం… బాబాయికి గొడ్డలి పోట్లు ఉంటే గుండెపోటా? అని ప్ర‌శ్నించారు.

వైఎస్ జ‌గ‌న్‌కు ఆయ‌న స‌తీమ‌ణి భారతికి మ‌ధ్య కూడా విభేదాలు ఉన్నాయ‌ని బాంబు పేల్చారు. జగన్ తప్పుల మీద తప్పులు చేస్తుంటే అది తట్టుకోలేక విజయసాయి రెడ్డి బయ‌టకు వచ్చారని అన్నారు. జగన్ లండన్ నుంచి ఏపీ వ‌చ్చేస‌రికి వైసీపీలోని అందరు లండన్ చేరడమేన‌ని అన్నారు. విజయసాయి రెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని వైసీపీ నేతలు బయటకు రావాల‌ని పిలుపునిచ్చారు. విజయసాయి రెడ్డి బాటలో చాలా మంది ఉన్నారని ఎమ్మెల్యే హింట్ కూడా ఇచ్చారు. వైసీపీకి కాలం చెల్లిపోయింద‌ని ముగించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • ap politics
  • BJP MLA
  • bjp vs ycp
  • MLA Adinarayana Reddy
  • vijaysai reddy
  • YS Bharti
  • ys jagan

Related News

More Good News for DWCRA Women: Loans Up to ₹10 Lakhs

Dwcra Womens: డ్వాక్రా మహిళలకు మరో శుభవార్త.. రూ.10 లక్షల వరకు రుణం

రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీపికబురు చెప్పారు. డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షల వ్యక్తిగత రుణం అందిస్తామని అన్నారు. ఎలాంటి పూచీకత్తు లేకుండా ఈ రుణాన్ని ఇస్తారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. డ్వాక్రా మహిళలు ఎంఎస్‌ఎంఈ యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు ఈ రుణాన్ని మంజూరు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

  • Chandrababu Naidu

    Chandrababu Naidu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

  • Prakash Raj Controversy

    Prakash Raj: ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు ప్రకాష్ రాజ్ మద్దతు

Latest News

  • Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

  • Karnataka : కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్? నేడు సీఎల్పీ కీలక సమావేశం

  • BJP : గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఓట్ల కోస‌మే ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌.. కాంగ్రెస్‌పై టీబీజేపీ చీఫ్ ఫైర్‌

  • Vaibhav : శతకం మిస్సైనా చరిత్ర సృష్టించిన వైభవ్.. ఐపీఎల్‌లో పలు రికార్డులు బద్దలు

  • IPL 2026 : సెంచరీతో చెలరేగిన గిల్.. ఐపీఎల్ ఫైనల్‌కి చేరుకున్న‌ గుజరాత్ టైటాన్స్

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd