Indrakeeladri : భవానీ దీక్షాపరులతో కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి
- By Prasad Published Date - 08:59 PM, Sat - 25 November 23

విజయవాడ ఇంద్రకీలాద్రీపై భక్తుల రద్దీ కొనసాగుతుంది. భవానీ దీక్షాధారులతో ఆలయంలో రద్దీ నెలకొంది. మూడో రోజు కూడా దుర్గ గుడి వద్ద భవానీ దీక్షలు కొనసాగుతున్నాయి. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో భవానీ దీక్షను మూడో రోజు భక్తులు అధిక సంఖ్యలో వేసుకున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దీక్షల ఏర్పాట్లను ఆలయ ఈవో రామారావు పర్యవేక్షించారు. లక్షకుంకుమార్చన, శ్రీ చక్ర నవావరణ అర్చన, చండీ హోమం, శాంతికల్యాణ తదితర సేవలు అందించారు. నవంబర్ 14 నుంచి డిసెంబర్ 12వ తేదీ వరకు కార్తీక మాసం సందర్భంగా దుర్గాదేవి ఆలయంలో ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఈఓ తెలిపారు. సహస్ర లింగార్చన సేవకు రోజుకు 500 మరియు నెలకు 5,116 ధర ఉంటుంది. సేవా టిక్కెట్లను దేవస్థానం వెబ్‌సైట్ www.kanakadurgamma.org, www.aptemples.ap.gov.in లేదా దేవస్థానం కౌంటర్‌లో పొందవచ్చని ఈవో తెలిపారు.
Also Read: TDP : తెర వెనుక తమ్ముడితో జగన్ రెడ్డి ఇసుక దోపీడి : మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు