HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Devotee From Hyderabad Dies In Tragic Incident At Durga Temple

Durga temple : దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకునేందుకు వ‌చ్చిన భ‌క్తుడు మృతి

ద‌స‌రా ఉత్స‌వాల స‌దర్భంగా ఇంద్ర‌కీలాద్రిపై భ‌క్తుల ర‌ద్ధీ ఎక్కువ‌గా ఉంది. అమ్మ‌వారిని....

  • Author : Prasad Date : 01-10-2022 - 7:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Durga Temple
Durga Temple

ద‌స‌రా ఉత్స‌వాల స‌దర్భంగా ఇంద్ర‌కీలాద్రిపై భ‌క్తుల ర‌ద్ధీ ఎక్కువ‌గా ఉంది. అమ్మ‌వారిని ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో ఇంద్ర‌కీలాద్రికి చేర‌కుంటున్నారు. అయితే అమ్మ‌వారిని ద‌ర్శించుకునేందుకు వ‌చ్చిన ఓ భ‌క్తుడు ద‌ర్శ‌నం అవ్వ‌క‌ముందే మ‌ర‌ణించాడు. జి. శ్రీరామ చంద్ర మూర్తి అనే భ‌క్తుడు దర్శనం కోసం ఉదయం 11:20 గంటలకు ఆలయానికి చేరుకున్నారు. అయితే అమ్మవారి దర్శనం కాకముందే కుప్పకూలిపోయాడు. ఇంద్రకీలాద్రి కొండపై ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరంలోని వైద్యులు భక్తుడిని తక్షణమే పరీక్షించి ప్రాథమిక చికిత్స అందించార‌ని.. ఎన్టీఆర్ జిల్లా ఆరోగ్య, వైద్యాధికారిణి డాక్టర్ ఎం. సుహాసిని తెలిపారు. అనంతరం అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి శ్రీరామచంద్రమూర్తి మృతి చెందినట్లు ప్రకటించారు. మృతుడు డయాబెటిక్, గుండె సంబంధిత రోగిగా గుర్తించారు.

ఇటు ఆల‌యంలో ఏర్పాట్ల‌ను దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిశీలిస్తున్నారు. శుక్రవారం భక్తుల క్యూ లైన్లను పరిశీలించారు. భారీ సంఖ్యలో భక్తులు క్యూలో వేచి ఉండగా, వారి కుటుంబ సభ్యులను దర్శనానికి తీసుకెళ్లిన పోలీసు సిబ్బందిని చూసి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.మ‌రో వైపు దుర్గగుడిలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెల్లంప‌ల్లి శ్రీనివాస‌రావు హ‌ల్చ‌ల్ చేశారు. తన కాన్వాయ్‌తో పాటు మ‌రో మూడు వాహనాలను కొండ‌పైకి తీసుకెళ్లారు. అయితే ఎమ్మెల్యే వాహ‌నానికి మాత్ర‌మే అనుమతి ఇచ్చిన పోలీసులు మిగిలిన మూడు వాహ‌నాల‌ను ఆపేశారు. దీంతో మాజీ మంత్రి వెల్లంప‌ల్లి పోలీసుల‌పై చిందులేశారు. కొండ‌పై ర‌చ్చ చేసిన త‌రువాత పోలీసులు మిగిలిన వాహ‌నాల‌ను కూడా అనుమ‌తించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • dasara
  • devotional
  • durga temple
  • Kanaka Durga Temple
  • vijayawada

Related News

SIT's sensational report on Sai Krishna's death.

Gade Sai Krishna: సాయి కృష్ణ డెత్ పై.. SIT సంచలన రిపోర్ట్

విజయవాడకు చెందిన గాదె సాయికృష్ణ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో అరెస్టైన కృష్ణలంక సీఐ నాగరాజు రిమాండ్ రిపోర్టులో సిట్ సంచలన విషయాలను పేర్కొంది. సాయికృష్ణ మరణించారని గుర్తించామని.. అతడిది కస్టోడియల్ డెత్ అని తేలిందని.. మృతదేహాన్ని మాయం చేసినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. మే 5 నుంచి జూన్ 19 మధ్య కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగిందని.. సాయికృష్ణపై నాన్ బెయిలబుల్

  • Simply planting these three trees—which are highly favored by Kubera—in the right direction at home will lead to a shower of wealth.

    Plants: కుబేరుడికి ఎంతో ఇష్టమైన ఈ 3 చెట్లను ఇంట్లో ఈ దిక్కున నాటితే చాలు.. కాసుల వర్షం కురుస్తుంది.

  • Kesineni Nani

    Kesineni Nani : గాదే సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై చంద్ర‌బాబుకు లేఖ రాసిన మాజీ ఎంపీ కేశినేని నాని

Latest News

  • Stock Market: భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌

  • Mumbai Rains: ముంబై మేయర్ కళ్లముందే మ్యాన్‌హోల్‌లో పడిపోయిన వ్యక్తి

  • Thyroid: థైరాయిడ్ వల్ల బరువు పెరుగుతున్నారా? అయితే వెంటనే ఇలా చేయండి.. అస్సలు బరువు పెరగరు!

  • Elders Blessings: పెద్దల పాదాలకు ఎందుకు నమస్కారం చేయాలి? పురాణాలు ఏం చెబుతున్నాయి?

  • Cm Revanth Reddy: SIR విషయంలో ఎవరినీ ఉపేక్షించబోము.. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd