HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Deputy Cm Pawan Is Angry With The Behavior Of The Police

AP Police : మరోసారి పోలీసుల తీరు పై డిప్యూటీ సీఎం పవన్ ఆగ్రహం

AP Police : రోడ్డు ప్రమాదాల సమయంలో పోలీసులు బాధ్యతగా వ్యవహరించాలని పవన్ అన్నారు. పోలీసులు చేసే తప్పులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తాయన్నారు.

  • Author : Sudheer Date : 09-11-2024 - 7:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan Ap Police
Pawan Ap Police

ఏపీలో పోలీసులు (AP Police) వ్యవహరిస్తున్న తీరు పట్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తీవ్ర స్థాయిలో ఆగ్రహంగా ఉన్నారు. మొన్నటి మొన్న పిఠాపురం పర్యటనలో రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు , నిర్లక్ష్యం పై ప్రజల ముందే ఆగ్రహం వ్యక్తం చేసారు.

రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలు , నేరాల పట్ల పోలీస్ శాఖ కు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. శాంతిభద్రతలు అదుపులో లేకుంటే, అవసరమైతే హోంమంత్రి పదవి (Home మినిస్టర్ Post)ని కూడా తాను తీసుకోవడానికి వెనుకాడనని స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో ఉన్నట్టుగా ప్రస్తుతం అధికారులు ప్రవర్తిస్తున్నారని ఆయన విమర్శించారు. అయితే, తాను హోంమంత్రి అయితే పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుందని పవన్ పేర్కొన్నారు. అలాగే వైసీపీ నేతలతో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పై కూడా ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఇప్పటికే పలువుర్ని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అయినప్పటికీ వారిలో మార్పు రావడం లేదు.

తాజాగా రోడ్డు ప్రమాదాల్లో పోలీసుల తీరుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కాకినాడలో జరిగిన ప్రమాదంలోని మృతుల కుటుంబాలను శనివారం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఈ ప్రమాదంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధిత కుటుంబాలు పవన్ దగ్గర కన్నీళ్ళు పెట్టుకున్నారు. రోడ్డు ప్రమాదాల సమయంలో పోలీసులు బాధ్యతగా వ్యవహరించాలని పవన్ అన్నారు. పోలీసులు చేసే తప్పులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తాయన్నారు. పోలీసుల తరఫున బాధితులకు క్షమాపణలు చెప్పి, తన ట్రస్టు ద్వారా రూ.2లక్షల చొప్పున ఆర్థికసాయం అందించారు.

రోడ్డు ప్రమాదాల సమయంలో పోలీసులు బాధ్యతగా వ్యవహరించండి

•కాకినాడ జిల్లా రోడ్డు ప్రమాద ఘటనలో ఇద్దరు విద్యార్థులు చనిపోతే పోలీసుల తీరు బాధితులకు మనస్తాపం కలిగించింది

•ఇంతటి బాధలోనూ రేవంత్ తల్లిదండ్రులు అవయవదానం చేయడం కదిలించింది
ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు

•మృతుల… pic.twitter.com/TVZrMPbT6F

— JanaSena Party (@JanaSenaParty) November 9, 2024

Read Also : Yuzvendra Chahal: ముంబై ఇండియ‌న్స్‌లోకి చాహ‌ల్‌?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap police
  • Pawan Kalayn
  • Thuni Accident

Related News

Anudeep Katikala Arrest

Comedian Anudeep: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు.. స్టాండప్ కమెడియన్‌ను అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు.

Anudeep Katikala హైదరాబాద్‌కు చెందిన స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికలను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఉత్తరప్రదేశ్‌లో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జనసేన నాయకుడు బడే వెంకట కృష్ణ ఫిర్యాదు మేరకు కాకినాడ పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. తన కామెడీ షోలో

  • AndhraPradesh Police Special Leaves

    AP Police: ఏపీ పోలీసులకు గుడ్ న్యూస్.. వారికి స్పెషల్ లీవ్స్

Latest News

  • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

  • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

  • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

  • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

  • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

Trending News

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd