HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Curfew In Vijayawada Due To Corona Virus

Lockdown : ఏపీలో మ‌ళ్లీ క‌రోనా విజృంభ‌ణ‌.. ఆ న‌గ‌రంలో క‌ర్ఫ్యూ

విజయవాడ పశ్చిమ: కరోనా ప్రభావంతో పాతబస్తీలోని మేకలపాటి వారి వీధిని అధికారులు అష్ట దిగ్బంధం చేశారు.

  • Author : Hashtag U Date : 28-11-2021 - 8:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

విజయవాడ పశ్చిమ: కరోనా ప్రభావంతో పాతబస్తీలోని మేకలపాటి వారి వీధిని అధికారులు అష్ట దిగ్బంధం చేశారు. ఓ యువకుడికి కరోనా లక్షణాలు బయటపడటంతో ఆదివారం సాయంత్రం నుండి అధికారులు అప్రమత్తమయ్యారు. కలెక్టర్ ఆదేశాల మేరకు కరోనా బాధితుని ఇంటి పరిసరాల్లో చుట్టూ కిలోమీటర్ మేర వీధులన్నింటినీ మున్సిపల్ అధికారులు బారికేడ్లతో మూసేశారు. ఐరన్ మెష్‌లు, ఐరన్ రాడ్ల సాయంతో పలువీధుల్లో రాకపోకలు నివారించారు. రాయల్ హోటల్ సెంటర్, జెండాచెట్టు సెంటర్, గులాబీ వీధి, డ్రైన్ వీధి, దూది ఫ్యాక్టరీ సందు, కోమల విలాస్ సెంటర్, రమణయ్య కూల్ డ్రింక్స్ సెంటర్, ఆర్‌ఆర్ అప్పారావు వీధి, హిందూ హైస్కూల్ ఎదురు రోడ్డు, ఇలా అన్ని దిక్కుల్లోని వీధులనూ మూసేశారు. కిలోమీటర్ పరిధిలో ఎవ్వరూ సంచరించకూడదని తెలిపారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు ఆదివారం జనతా కర్ఫ్యూ నిర్వహించగా పాతబస్తీలో ఆదివారం సాయంత్రం నుండి ఈ నెల 31వరకు కలెక్టర్ నివాస్ ఆదేశాల మేరకు కర్ఫ్యూ కొనసాగుతుంది. నీటి సరఫరా, పారిశుద్ధ్యానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు చేపడుతున్నారు. ఈప్రాంతం ఆసాంతం తమ ఆధీనంలో ఉంటుందని, ముగ్గురు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఆరుగురు డిప్యూటీ ఇంజనీర్లు, ఒక సూపరిటెండెంట్ ఇంజనీరు, ఈఈ ఇన్‌చార్జి నారాయణమూర్తి, డీఈలు రవికుమార్, రంగారావు, ఏఈలు రవీంద్రకుమార్, శాంతికుమార్, రాజేష్, తదితరులు రేయింబవళ్లు విధులు నిర్వహించనున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ చీఫ్ ఇంజనీర్ మరియన్న వివరించారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • lockdown
  • vijayawada

Related News

'birla New'

‘Birla New’ : విజయవాడలో మెగా స్టోర్ ప్రారంభం

దక్షిణ భారత మార్కెట్‌పై బిర్లా న్యూ ప్రత్యేక దృష్టి సారించిందనేందుకు విజయవాడను ఎంచుకోవడమే నిదర్శనం. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో రూ. 127 కోట్ల వ్యయంతో ఫైబర్ సిమెంట్ బోర్డు ప్లాంట్‌ను నెలకొల్పిన ఈ సంస్థ, ఇప్పుడు వినియోగదారులకు నేరుగా చేరువయ్యేందుకు

  • Featherlight

    Featherlight : విజయవాడలో ‘ఫెదర్‌లైట్’ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ను ప్రారంభం

Latest News

  • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

  • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

  • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

  • Roja Selvamani: మరోసారి జగన్‌ను విజయ్ ఫాలో అవుతున్నారు – రోజా

  • Rowdy Janardhana: విజయ్ బర్త్‌డే స్పెషల్.. రౌడీ జనార్ధన’ న్యూ పోస్టర్‌

Trending News

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    • CM VIJAY: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌

    • Breaking News: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మేజిక్ ఫిగర్ చేరిక

    • సభ్యసమాజం తలదించుకునే ఘటన.. అక్కాతమ్ముడి పెళ్లి.. ఎక్కడంటే..?

    • TVK: 107 మంది ఎమ్మెల్యేలు తో విజయ్ రాజీనామా

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd