HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Covid 19 Scare Returns To Ap 12 Cases Reported Across 4 Districts

Covid: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. 4 జిల్లాల్లో 12 కొవిడ్‌ కేసులు

  • Author : Vamsi Chowdary Korata Date : 17-07-2026 - 10:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
COVID-19 scare returns to AP; 12 cases reported across 4 districts.
COVID-19 scare returns to AP; 12 cases reported across 4 districts.

ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్ కేసులు మరోసారి టెన్షన్ పెడుతున్నాయి. కొద్దిరోజులుగా పాజిటివ్ కేసులు నమోదు కావడం కలవరపెడుతోంది. తాజాగా కొవిడ్ కేసులపై వైద్య ఆరోగ్య శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో 12 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, బాధితుల్లో నలుగురు చనిపోయినట్లు ప్రకటించారు. చనిపోయినవారు కడప జిల్లాలో ముగ్గురు, కాకినాడ జిల్లాలో ఒకరు మృతిచెందారని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి జి. వీరపాండియన్ తెలిపారు. కొవిడ్ పాజిటివ్‌గా తేలి చనిపోయిన నలుగురికి తీవ్ర అనారోగ్య సమస్యలున్నాయని పేర్కొన్నారు.

రాష్ట్రంలో నమోదైన మొత్తం 12 కేసుల్లో కడప జిల్లాలో ఎనిమిది, గుంటూరులో రెండు, విశాఖపట్నం, కాకినాడ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయని వీరపాండియన్ తెలిపారు. కొవిడ్ పాజిటివ్ తేలినవారికి సన్నిహితంగా మెలిగిన వారు ఇద్దరు ఉన్నారని చెప్పారు. రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని, ముందు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఒకవేళ అనుమానిత లక్షణాలు ఉంటే ఆసుపత్రులకు వెళ్లాలన్నారు. రాష్ట్రంలో నమోదవుతున్న కొవిడ్ కేసులకు సంబంధించి వైరస్‌ జన్యు క్రమ స్వరూపాన్ని గుర్తించేందుకు ఐదు శాంపిల్స్ సేకరించి పుణెలోని నేషనల్ వైరాలజీ ల్యాబ్‌కు పరీక్షల కోసం పంపినట్లు తెలిపారు.

జూన్ 26 నుంచి జులై 16 వరకు నాలుగు జిల్లాల్లో 12 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 67 మందికి చెందిన శాంపిల్స్ పరీక్షిస్తే, 11 మందికి పాజిటివ్‌గా తేలింది. కాకినాడ జిల్లాకు చెందిన వ్యక్తికి తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు సీఎంసీలో కొవిడ్ పాజిటివ్‌గా తేలింది.

విశాఖపట్నంలో కొవిడ్ పాజిటివ్ తేలిన వ్యక్తి కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌ వెళ్లి వచ్చారు. అప్పటి నుంచి జ్వరం, తలనొప్పితో బాధపడుతుండటంతో ఆర్టీపీసీఆర్ పరీక్ష చేస్తే పాజిటివ్‌గా తేలింది. ఆయన భార్యకు పరీక్ష నిర్వహించగా, ఆమెకు నెగిటివ్‌గా వచ్చింది.

నమోదైన కొవిడ్ కేసులు వేర్వేరు జిల్లాల్లో ఉన్నాయి. పాజిటివ్ తేలినవారిలో ముగ్గురు హోం క్వారంటైన్‌లో ఉండగా, ఇద్దరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరో ముగ్గురు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీ ప్రభుత్వం డాక్టర్లు, ఆస్పత్రులు, సిబ్బందిని అప్రమత్తం చేసింది. దేశవ్యాప్తంగా జులై 1 నుంచి 339 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో కేరళలో 115, కర్ణాటకలో 64, మహారాష్ట్రలో 43, తమిళనాడులో 39, అండమాన్‌లో 18, దిల్లీలో 18, రాజస్థాన్‌లో 12, ఇతర రాష్ట్రాల్లో మరికొన్ని కొవిడ్ కేసులు నమోదయ్యాయి.

ఆంధ్రప్రదేశ్‌లో డీఎంహెచ్‌వోలు, జీజీహెచ్‌లు, బోధనాసుపత్రుల సూపరింటెండెంట్లను అలర్ట్ చేశారు. ఇప్పటికే అవసరమైన మార్గదర్శకాలు జారీ చేశారు. ముందస్తు జాగ్రత్తగా ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ కిట్లు, వీటీఎం, పీపీఈ కిట్లు, మాస్కులు, శానిటైజర్లు, ఆక్సిజన్, మందులు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. అంతేకాదు ఆసుపత్రుల్లో కొవిడ్ వార్డులు ఏర్పాటు చేసి, అవసరమైన యాంటీబయాటిక్స్, ఇతర సాధారణ మందులు అందుబాటులో ఉంచుతున్నారు. బీపీ, షుగర్ సహా దీర్ఘకాలిక సమస్యలున్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మొత్తం మీద కొవిడ్ భయం మరోసారి జనాల్ని వణికిస్తోంది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • AP Health Department
  • breaking news
  • Covid 19 Alert

Related News

Egg prices skyrocket... hitting record levels.

Egg Price Hike: కొండెక్కిన గుడ్డు.. రికార్డు స్థాయికి కోడిగుడ్డు ధరలు

హైదరాబాద్ నగరంలో సామాన్యుడికి అత్యంత చౌకైన ప్రొటీన్ ఆహారంగా నిలిచే కోడిగుడ్డు ధరలు ఒక్కసారిగా కొండెక్కాయి. మార్కెట్లో డిమాండ్, సప్లై మధ్య తీవ్ర వ్యత్యాసం ఏర్పడటంతో రిటైల్ మార్కెట్లో ఒక్కో కోడిగుడ్డు ధర రికార్డు స్థాయిలో రూ. 8 నుండి రూ. 9 కి చేరింది. సాధారణంగా శీతాకాలంలో మాత్రమే పెరిగే  గుడ్డు ధరలు, ఈ విధంగా వర్షాకాలంలోనే భారీగా పెరగడం పట్ల వినియోగదారులు మరియు వ్యాపార

  • Following Iran's threat to close the Strait of Hormuz... attacks on a Kuwaiti refinery and US infrastructure in Bahrain.

    Kuwait Refinery: హోర్ముజ్ జలసంధిని మూసివేయాలని ఇరాన్ హెచ్చరించడంతో.. కువైట్ రిఫైనరీ, బహ్రెయిన్‌లోని అమెరికా మౌలిక సదుపాయాలపై దాడి

  • High tension at Mudragada's residence; wife and supporters prevent daughter from entering.

    Mudragada Kranthi: ముద్రగడ నివాసం వద్ద హై టెన్షన్.. కూతురిని రానివ్వని భార్య, అభిమానులు

  • Deadline for 'SIR' extended in AP!

    Election Commission: ఏపీలో ‘SIR’ గడువు పెంపు!

  • Scorching heat ahead; intense sultriness today as well.

    Weather update: దంచికొట్టనున్న ఎండలు.. నేడు కూడా తీవ్ర ఉక్కపోత

Latest News

  • Stock Market: భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • Jagannath Rath Yatra: జగన్నాథ రథయాత్రలో ‘తొక్కిసలాట’ జరిగిందన్న వార్తలను ఒడిశా ప్రభుత్వం ఖండించింది

  • Black Coffee: రోజూ ఒక కప్పు బ్లాక్ కాఫీ తాగితే ఏం జరుగుతుందో మీకు తెలుసా!

  • Vivek Oberoi: ‘నేను నటుడిని, రాజకీయ నాయకుడిని కాదు’.. సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్షపై వివేక్ ఒబెరాయ్ షాకింగ్ కామెంట్స్

  • Telangana Pensions: కొత్త పెన్షన్లు.. ఒంటరి మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి సీతక్క

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd