AP Special Status: లోకసభ ఎన్నికలకు ముందు తెరపైకి ఏపీ ప్రత్యేక హోదా అంశం
దేశంలో త్వరలో లోకసభ ఎన్నికలు జరగనున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరపనున్నారు. అయితే పదేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాలను విడగొట్టిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్
- Author : Praveen Aluthuru
Date : 25-02-2024 - 1:39 IST
Published By : Hashtagu Telugu Desk
AP Special Status: దేశంలో త్వరలో లోకసభ ఎన్నికలు జరగనున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరపనున్నారు. అయితే పదేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాలను విడగొట్టిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తుండటం చర్చనీయాంశమైంది.
2014 ఫిబ్రవరిలో రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ఇచ్చిన హామీ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదా కల్పిస్తేనే ఆంధ్రప్రదేశ్ పట్ల అసలైన నిబద్ధత నిరూపితమవుతుందని కాంగ్రెస్ పేర్కొంది. గత వారం రోజులుగా మంగళగిరిలో ఎయిమ్స్, తిరుపతిలో ఐఐటీని ప్రధాని మోదీ ప్రారంభించారని కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్‌ఛార్జ్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ పేర్కొన్నారు.ఈ రెండు సంస్థలు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నారు. వాస్తవానికి మిస్టర్ మోడీ క్రెడిట్ తన ఖాతాలో వేసుకుంటున్నారని విమర్శించారు జైరాం రమేష్.
2014న రాజ్యసభ వేదికపై మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రి హోదాలో ఏపీకి ప్రత్యేక కేటగిరీ హోదా కల్పించారు. తద్వారా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి పటిష్టమవుతుందని భావించారు. ఈ పదేళ్లు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా నిర్ణయించారు. అయితే ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం కోల్పోవడంతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయంగా చెప్పుకుంటున్నారు.ఇప్పుడు మోడీని ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్. అప్పట్లో బీజేపీ ప్రభుత్వం పదేళ్లు ఏపీకి ప్రత్యేక హుడా ఇస్తామని వెంకయ్యనాయుడు చెప్పిన విహాయన్ని జైరాం గుర్తు చేశారు. మిస్టర్ వెంకయ్య నాయుడు మరియు మిస్టర్ మోడీ ఇప్పుడు మీరిద్దరూ సమాధానం చెప్పాలని రమేష్ అన్నారు.
Also Read: Trump Win : నిక్కీ హేలీకి షాకిచ్చిన ట్రంప్.. ఎన్నికల రేసులో ఏం జరిగిందంటే..