Cyclone Michuang: రేపు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన
ఆంధ్రప్రదేశ్ సీఎం వైస్ జగన్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. రేపు శుక్రవారం సీఎం జగన్ తిరుపతి అలాగే బాపట్ల జిల్లాల్లో పర్యటిస్తారు. ఈ మేరకు సీఎంఓ ఓ ప్రకటనలో తెలిపింది. ముందుగా తిరుపతి జిల్లా వాకాడు మండలం బలిరెడ్డి పాలెంలో సీఎం జగన్ పర్యటిస్తారు
- Author : Praveen Aluthuru
Date : 07-12-2023 - 9:48 IST
Published By : Hashtagu Telugu Desk
Cyclone Michuang: ఆంధ్రప్రదేశ్ సీఎం వైస్ జగన్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. రేపు శుక్రవారం సీఎం జగన్ తిరుపతి అలాగే బాపట్ల జిల్లాల్లో పర్యటిస్తారు. ఈ మేరకు సీఎంఓ ఓ ప్రకటనలో తెలిపింది. ముందుగా తిరుపతి జిల్లా వాకాడు మండలం బలిరెడ్డి పాలెంలో సీఎం జగన్ పర్యటిస్తారు. అక్కడ స్వర్ణముఖి నది కరకట్ట వల్ల దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించనున్నారు.అనంతరం బాపట్ల జిల్లా మరుప్రోలువారిపాలెంకు సీఎం జగన్ వెళ్తారు. అక్కడ తుపాను బాధితులతో మాట్లాడతారు. అనంతరం కర్లపాలెం మండలం పాతండాయపాలెం చేరుకుని బాధిత రైతులను పరామర్శిస్తారు. అనంతరం బుద్దాలో దెబ్బతిన్న వరి పంటను పరిశీలించిన అనంతరం రైతులతో సీఎం సమావేశం అవుతారు. ఇదిలా ఉండగా రేపు చంద్రబాబు కూడా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. శుక్రవారం టీడీపీ అధినేత చంద్రబాబు మిగ్ జాం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఈ నెల 8 నుంచి ఆయన 2 రోజుల పాటు తుపాను ప్రాంతాల్లో పంట నష్టాన్ని పరిశీలించనున్నారు.
Also Read: Dosakaya Mulakkada Curry: ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ ములక్కాడ కూర.. తయారు చేసుకోండిలా?