CM Jagan: సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై శుక్రవారం విచారణ
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దుపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టనుంది. జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్ నేతృత్వంలోని ధర్మాసనం
- Author : Praveen Aluthuru
Date : 22-11-2023 - 2:56 IST
Published By : Hashtagu Telugu Desk
CM Jagan: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దుపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టనుంది. జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం ఈ పిటిషన్‌ను విచారిస్తుంది. జగన్ బెయిల్ రద్దు చేయాలని ఎంపీ రఘురామ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై శుక్రవారం విచారిస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. కాగా అక్రమ ఆస్తుల కేసులో సీఎం జగన్ పదేళ్లుగా బెయిల్ పై ఉన్నారు. అంతకుముందు సీబీఐ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. అయితే హైకోర్టు తీర్పును రఘురామ సుప్రీంకోర్టులో సవాలుచేస్తూ మరో పిటిషన్ దాఖలు చేశారు.
Also Read: Slow Over Rule: స్లో ఓవర్‌రేట్‌కు చెక్ పెట్టేందుకు ఐసీసీ కీలక నిర్ణయం