Chandrababu : కొలికపూడికి ‘కోలుకోలేని’ షాక్ ఇచ్చిన బాబు !
Chandrababu : నందిగామ పర్యటనలో తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావుని చంద్రబాబు పట్టించుకో లేదు. అక్కడ హెలికాప్టర్ దిగి నేతలను పరిచయం చేసుకున్న సందర్భంలో
- By Sudheer Published Date - 08:46 PM, Sat - 5 April 25

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి వివాదం కొనసాగుతూనే ఉంది. కొలికపూడి (MLA Kolikapudi Srinivasa Rao) తీరు పైన ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే వరుస వివాదాలతో కొలికపూడి పార్టీలో ఒక వర్గానికి దూరం అయ్యారు. నియోజకవర్గంలో మరో వర్గ నేతలు ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలని పదే పదే డిమాండ్ చేస్తోంది. తాజాగా ప్రత్యేకంగా సమావేశమై తీర్మానం చేసారు. కొలికపూడి వ్యవహర శైలితో ఇబ్బందులు పడుతున్న తిరువూరు టీడీపీ నేతలు ఆయనపై తిరుగుబాటు జెండా ఎగుర వేశారు. ఇటీవల కొలికపూడికి వ్యతిరేకంగా ఏపీ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ శావల దేవదత్ ఆధ్వర్యంలో నాలుగు మండలాల నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే తీరుపై టీడీపీ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పార్టీ స్థాపించిన నాటి నుంచి నేతలకు ఎమ్మెల్యే గుర్తింపు, గౌరవం ఇవ్వడం లేదని వాపోయారు. ఎమ్మెల్యేకు ఉన్న అధికారులు కట్టడి చేసి పార్టీ ఇన్‌చార్జ్‌గా మరొకరికి అవకాశం ఇవ్వాలని తీర్మానించారు. ఎమ్మెల్యే కొలికపూడిపై పార్టీ అధిష్టానం కూడా సీరియస్ అయింది.
Pithapuram : పిఠాపురంలో రాజకీయ లెక్కలు మారుతున్నాయా..?
ఎమ్మెల్యే కొలికపూడి ఈ మధ్య కాలంలో తన నియోజకవర్గంతో ఎస్టీ మహిళల ఫిర్యాదు మేరకు 48 గంటల్లో ఏఎంసీ మాజీ చైర్మన్ రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే తాను పార్టీకి రాజీనామా చేస్తా నంటూ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేసారు. దీనిని పార్టీ నాయకత్వం సీరియస్ గా తీసుకుంది. కొలికపూడి వ్యవహార శైలి, కొలికపూడిలో జరుగుతున్న పరిస్థితులపై నివేదిక ఇవ్వాల్సిందిగా నెట్టెం రఘురాం, ఎంపీ కేశినేని, మంతెన సత్యనారాయణను అధిష్టానం ఆదేశించింది. దీంతో తిరువూరులో పర్యటించిన ముగ్గురు కమిటి సభ్యులు తిరువూరులో జరుగుతున్న పరిణామాలు, పార్టీ నేతల అభిప్రాయాలు, కొలికపూడిపై వస్తున్న ఆరోపణలపై నివేదికను సిద్దం చేసారు. ఇదే సమయంలో ఈ రోజు చంద్రబాబు నందిగామ పర్యటనకు వెళ్లిన సమయంలో కొలికపూడికి తన మార్క్ ట్రీట్‌మెంట్ ఇచ్చారు.
CSK vs DC: హోం గ్రౌండ్‌లో చిత్తు చిత్తుగా ఓడిన సీఎస్కే.. ఓటమికి ధోనీ కారణమా?
నందిగామ పర్యటనలో తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావుని చంద్రబాబు పట్టించుకో లేదు. అక్కడ హెలికాప్టర్ దిగి నేతలను పరిచయం చేసుకున్న సందర్భంలో.. కొలికేపూడి వైపు సీరియస్ గా ఉన్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. అందరి నేతలతో కరచాలనం చేసిన చంద్రబాబు … కానీ కొలికిపూడితో కరచాలనం చేయడానికి ఇష్టపడనట్లు కనిపించింది. దీంతో చంద్రబాబు పార్టీ నేతలతో మాట్లాడుతున్న సమయంలో ఒంటరిగా కొలికపూడి చేసేది లేక .. వెనక్కి వెళ్లి నిలబడ్డారు. ఆ తరువాత అక్కడ నుంచి వెళ్లిపోయారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే తీరు మారకుంటే కొత్త ఇంఛార్జ్ కి బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం సాగుతోంది. దీంతో త్వరలోనే కొలికపూడి వివాదానికి మగింపు పలికే అవకాశం ఉందని చెబుతున్నారు.