Kaleshwaram Project : కేసీఆర్ కు ఇది న్యాయమేనా? మహా వేదికపై చంద్రబాబు సూటి ప్రశ్న
Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్టుపై తన వైఖరిని స్పష్టంగా వెల్లడించిన చంద్రబాబు, తాను ఎప్పుడూ ఆ ప్రాజెక్టును వ్యతిరేకించలేదని స్పష్టం చేశారు
- By Sudheer Published Date - 09:39 PM, Wed - 28 May 25

తెలుగుదేశం పార్టీ మహానాడు (Mahanadu) వేడుక కడపలో అంగరంగ వైభవంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు (Chandrababu) నాయుడు కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project)పై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తనకు రెండు కళ్లలాంటివని పేర్కొంటూ, విభజన జరిగినా రాష్ట్రాల అభివృద్ధి పట్ల తన అంకితభావం యథాతథంగా కొనసాగుతుందని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధిలో తన పాత్రను ప్రస్తావిస్తూ, ఐటీ రంగాన్ని గ్లోబల్ స్థాయికి తీసుకువచ్చిన తానేనని, విద్యుత్ రంగంలో మొదటి సంస్కరణలు తీసుకురావడం వల్లే రాష్ట్రం కరెంట్ లో మిగులు స్థాయికి చేరిందని చెప్పారు.
Virat Kohli: పంజాబ్ బౌలర్లను వణికిస్తున్న విరాట్ కోహ్లీ సెంటిమెంట్!
కాళేశ్వరం ప్రాజెక్టుపై తన వైఖరిని స్పష్టంగా వెల్లడించిన చంద్రబాబు, తాను ఎప్పుడూ ఆ ప్రాజెక్టును వ్యతిరేకించలేదని స్పష్టం చేశారు. గోదావరి జలాల వినియోగంపై వస్తున్న అపోహలను తొలగిస్తూ, సముద్రంలోకి వృథాగా పోతున్న నీటిని ఉపయోగించుకుంటే అందరికీ లాభమేనని, తెలంగాణకు నష్టం లేదని వివరించారు. ప్రత్యేకించి రాయలసీమ వంటి కరువు ప్రాంతాలకు సాగునీరు అందించడమే తన లక్ష్యమని తెలిపారు. రైతుల బాగోగులు, నీటి వినియోగంపై తన దృష్టిని అందించిన చంద్రబాబు, బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారాలను ప్రజలు విశ్వసించరాదన్నారు.
ఇక రెండు రాష్ట్రాల ప్రజల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని చంద్రబాబు పునరుద్ఘాటించారు. రాజకీయ విభేదాలకు బదులు అభివృద్ధి అంశాలపై దృష్టి పెట్టాలన్నది తన సూచనగా పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు గతంలో తనను ఎలా ఆదరించారో గుర్తు చేస్తూ, వారి రుణం తీర్చుకోవడమే తన జీవితాశయం అని అన్నారు.