HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Clear Change In State Development Cm Chandrababu

CM Chandrababu : రాష్ట్ర అభివృద్ధిలో స్పష్టమైన మార్పు: సీఎం చంద్రబాబు

త పాలనలో నిరాశ, నిస్పృహే నెలకొన్నాయి. ఆర్థికంగా రాష్ట్రాన్ని పాతాళానికి తోసేసారు. అయితే ఇప్పుడు మన పరిపాలనతో ప్రజలకు నమ్మకం కలుగుతోంది. అభివృద్ధి, సంక్షేమం ఒకేసారి అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నాం అన్నారు.

  • Author : Latha Suma Date : 07-06-2025 - 4:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Clear change in state development: CM Chandrababu
Clear change in state development: CM Chandrababu

CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో ఏడాది కాలంలో స్పష్టమైన మార్పు చోటుచేసుకుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. టీడీపీ నేతలతో జరిగిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ… గత ప్రభుత్వంలో నెలకొన్న చీకటి యుగానికి తెరపడిందని, రాష్ట్ర ప్రజలు నూతన ఆశతో ముందుకెళ్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు మనం తీసుకున్న నిర్ణయాలు ఫలితాలిస్తున్నాయి. గత పాలనలో నిరాశ, నిస్పృహే నెలకొన్నాయి. ఆర్థికంగా రాష్ట్రాన్ని పాతాళానికి తోసేసారు. అయితే ఇప్పుడు మన పరిపాలనతో ప్రజలకు నమ్మకం కలుగుతోంది. అభివృద్ధి, సంక్షేమం ఒకేసారి అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నాం అన్నారు.

Read Also: TDP : టీడీపీ కీలక ప్రకటన: ఇతర పార్టీ నేతల జాయినింగ్‌కు కొత్త మార్గదర్శకాలు

ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు ఆయన ముఖ్యమైన సందేశం ఇచ్చారు. పార్టీ ప్రతి నాయకుడి పనితీరుపై సర్వేలు చేయిస్తున్నామని, మంచి పనితీరు కనబరిచిన వారికి ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. అదే సమయంలో పార్టీకి లేదా ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. “మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు మరింత బాధ్యతగా పనిచేయాలి. ప్రజలకు అందుబాటులో ఉండాలి. వన్‌టైమ్ ఎమ్మెల్యేలుగా మిగలిపోకూడదు. ప్రతి ఆరు నెలలకు వారి పనితీరుపై సమీక్షలు జరుగుతాయి” అని అన్నారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రారంభించిన పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామన్న చంద్రబాబు, ‘తల్లికి వందనం’ స్కీం కింద ఈ నెల 12 లేదా 14 లోపు లబ్దిదారులకు నగదు అందజేస్తామని ప్రకటించారు. మహిళా సంక్షేమాన్ని ప్రాధాన్యంగా తీసుకుంటున్న ఈ ప్రభుత్వం తల్లుల పట్ల గౌరవాన్ని మరింత పెంచేలా చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

ఒక సంవత్సరం పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 12న రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ విజయోత్సవ ర్యాలీలు నిర్వహించనున్నారు. అదే రోజున సాయంత్రం ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు, అధికారులు కలిసి సమీక్షా సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వచ్చే నాలుగేళ్ల అభివృద్ధి ప్రణాళికలపై చర్చించనున్నారు. “రాష్ట్ర పునర్నిర్మాణ యజ్ఞంలో ఎవరు అడ్డుపడినా మన ప్రయాణం ఆగదు. ప్రజలు అన్నీ గమనిస్తారు. తప్పుడు ప్రవర్తనను మేము సహించం. మీరు నిజాయితీగా పనిచేస్తే, పార్టీతో పాటు ప్రజల మన్నన పొందుతారు” అంటూ చంద్రబాబు నాయకులకు పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలన్నీ టీడీపీ భవిష్యత్తు దిశలో సుదీర్ఘ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నదని స్పష్టంగా వెల్లడిస్తున్నాయి.

Read Also: Telangana : మంత్రి వర్గ విస్తరణకు అధిష్ఠానం గ్రీన్‌ సిగ్నల్‌.. కొత్తగా ముగ్గురు లేదా నలుగురికి మంత్రివర్గంలో చోటు..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Advice to party ranks
  • CM Chandrababu
  • state development
  • tdp leaders
  • teleconference

Related News

Mahanadu

Mahanadu : ముగిసిన మ‌హానాడు.. వ‌ర్చువ‌ల్‌గా 24 ల‌క్ష‌ల మంది హాజ‌రు

తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకమైన తెలుగుదేశం పార్టీ మహానాడు 2026 సరికొత్త చరిత్ర సృష్టించింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ మహాసభలో నేతలు, కార్యకర్తలు ఉత్సాహం పాల్గొన్నారు. నరేంద్ర మోడీ పిలుపుమేరకు పొదుపులో భాగంగా హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన ఈ మహానాడు ప్రపంచానికి కొత్త మార్గం చూపించింది. 1875 క్లస్టర్లు, 12 దేశాల నుంచి వేలాది నాయకులు, కార్యకర్తలు వర్చువల్‌గా పాల్గొన్నార

  • Mahandu 2026

    TDP : టీడీపీ మహానాడులో తెలంగాణపై చర్చ.. ఎన్టీఆర్, చంద్రబాబు సేవలను గుర్తుచేసిన నేతలు

  • Msme Summit 2026

    AP : ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ – 2026లో కీలక ఒప్పందాలు చేసుకున్న ఏపీ ప్ర‌భుత్వం

Latest News

  • TPCC : హైదరాబాద్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిసిన జగన్నారెడ్డి

  • New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కసరత్తు వేగవంతం

  • Road Accident : ఖ‌మ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. కానిస్టేబుల్ మృతి

  • Delhi : పెళ్లికి కోటి రూపాయలకు పైగా ఖర్చు.. 17 నెలల్లోనే కూతురు మృతి

  • CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd