Christmas : ఏపీ వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైన క్రిస్మస్ వేడుకల.. చర్చిల్లో ప్రార్థనలు చేస్తున్నక్రైస్తవ సోదరులు
ఏపీ వ్యాప్తంగా క్రిస్మస్ సందడి ప్రారంభమైంది. తెల్లవారుజామున నుంచే క్రైస్తవ సోదరులు చర్చిలకు క్యూకట్టారు. క్రిస్మస్
- By Prasad Published Date - 09:25 AM, Mon - 25 December 23
ఏపీ వ్యాప్తంగా క్రిస్మస్ సందడి ప్రారంభమైంది. తెల్లవారుజామున నుంచే క్రైస్తవ సోదరులు చర్చిలకు క్యూకట్టారు. క్రిస్మస్ సందర్భంగా పలువురు ముఖ్యనేతల ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తన ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. ఏసు ప్రభువు జీవనం అందరికీ ఆదర్శప్రాయమని సీఎం జగన్ స్పష్టం చేశారు. ‘దైవ కుమారుడు జీసస్ మానవునిగా జన్మించిన రోజును ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగగా జరుపుకుంటారు. ఏసుప్రభువు జీవనం అందరికీ ఆదర్శప్రాయం. తన బోధనల ద్వారా మానవాళిని సన్మార్గం వైపు నడిపించేలా మార్గనిర్దేశం చేశారు. నిస్సహాయులపై కరుణ, సాటివారిపై ప్రేమ, క్షమా, సహనం, దాతృత్వం, త్యాగం.. ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలు. ఎల్లప్పుడూ ఆ కరుణామయుని ఆశీస్సులు, దీవెనలు ప్రజలకు ఉండాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
మంగళగిరిలోని తెలుగుదేశం ప్రధాన కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కేక్ కట్ చేసి క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్రమైన రోజున శాంతి, సహనం, దాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిఒక్కరూ యేసు అడుగుజాడల్లో నడవాలని, అందరి పట్ల కరుణ మరియు ప్రేమను అలవర్చుకోవాలని ఆయన కోరారు. ఈ క్రిస్మస్ ప్రతి ఒక్కరికీ సంతోషకరంగా ఉండాలని ఆయన తెలిపారు.
Also Read: TDP : ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ టీడీపీకి బోనస్ – ఆనం వెంకటరమణారెడ్డి