పరిటాల రవీంద్ర వర్థంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళి
- Author : Vamsi Chowdary Korata
Date : 24-01-2026 - 10:41 IST
Published By : Hashtagu Telugu Desk
Chandrababu Naidu About Greatness Of Paritala Ravi On His Death Anniversary మాజీ మంత్రి పరిటాల రవీంద్ర 21వ వర్ధంతి సందర్భంగా టీడీపీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. పేదలు, బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసిన నేతగా పరిటాల రవీంద్ర ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించారని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు.
- ఎక్స్ వేదికగా చంద్రబాబు నివాళి
- రవీంద్ర ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించారన్న సీఎం చంద్రబాబు
- అభివృద్ధి కార్యక్రమాలతో అనంతపురం జిల్లా ప్రజల విశ్వాసాన్ని పొందారని కితాబు
ప్రజాసేవనే ధ్యేయంగా రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తూ, అభివృద్ధి కార్యక్రమాలతో అనంతపురం జిల్లా ప్రజల విశ్వాసాన్ని పొందారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఎక్స్ వేదికగా నివాళులర్పించారు.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా పరిటాల అభిమానులు, నాయకులు, కార్యకర్తలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పిస్తున్నారు.