Chevireddy Mohith Reddy : చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి అరెస్ట్
గత కొద్దీ రోజులుగా చెవిరెడ్డి బెంగుళూర్ లో మకాం పెట్టగా..అతడి జాడ తెలుసుకున్న పోలీసులు శనివారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు
- By Sudheer Published Date - 11:06 PM, Sat - 27 July 24

చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని (Nani)పై జరిగిన హత్యాయత్నం ఘటనకు సంబంధించి పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసులో 37వ నిందితుడైన చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి(Chevireddy Mohith Reddy)ని పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. గత కొద్దీ రోజులుగా చెవిరెడ్డి బెంగుళూర్ లో మకాం పెట్టగా..అతడి జాడ తెలుసుకున్న పోలీసులు శనివారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
అరెస్టుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచారు. ఎన్నికల అనంతరం పద్మావతి మహిళా యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్‌ను పరిశీలించడానికి వెళ్లిన పులివర్తి నానిపై మోహిత్ రెడ్డి అనుచరులు ప్లాన్ ప్రకారం దాడి చేశారు. కారులో ఉన్న కెమెరాల్లో దాడి దృశ్యాలు నమోదయ్యాయి. ఈ ఘటనలో 17 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ దాడిలో ప్రధాన నిందితుడు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి పరారీలో ఉన్నారు. 307 సెక్షన్ కింద ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
Read Also : 2024 Paris Olympics : పీవీ సింధు కట్టిన చీరపై వివాదం