Chandrababu : కేంద్ర మంత్రి నిర్మలాతో ముగిసిన చంద్రబాబు భేటీ
Chandrababu : ముఖ్యంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులపైనే చర్చ, ఏపీ రాజధాని అమరావతి(Amaravati) అభివృద్ధికి కేంద్రం ప్రకటించిన నిధుల విషయం కేంద్రమంత్రి వద్ద ప్రస్తావించనున్నట్టు తెలుస్తోంది
- By Sudheer Published Date - 07:44 PM, Fri - 15 November 24

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తో సీఎం చంద్రబాబు (Chandrababu) భేటీ ముగిసింది. ఢిల్లీలోని నిర్మలా నివాసంలో దాదాపు గంటసేపు పలు విషయాలపై ఇరువురు చర్చించారు. ముఖ్యంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులపైనే చర్చ, ఏపీ రాజధాని అమరావతి(Amaravati) అభివృద్ధికి కేంద్రం ప్రకటించిన నిధుల విషయం కేంద్రమంత్రి వద్ద ప్రస్తావించనున్నట్టు తెలుస్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amith Sha)తో సమావేశం అవుతారని సమాచారం. అలాగే కేంద్ర మంత్రులనూ చంద్రబాబు కలుస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సమావేశాలు ముగించుకొని రేపు ఉదయం మహారాష్ట్రకి వెళ్లనున్నారు.
ఈనెలలో జరగబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక(Maharashtra Assembly Elections)ల్లో ఎన్డీఏ(NDA) తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఎన్డీయే తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. బీజేపీ పెద్దల ఆహ్వానం మేరకు ఈ నెల 16, 17 తేదీల్లో ఇద్దరు నేతలు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు. శనివారం అసెంబ్లీ సమావేశాలకు ఇద్దరు ముఖ్య నేతలు అందుబాటులో ఉండరు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో తెలుగువారు ఎక్కువగానే నివాసం ఉండే ప్రాంతాల్లో ప్రచారం చేయబోతున్నట్లు తెలుస్తోంది.
Read Also : Congress MP Tweets: కేటీఆర్ మిమ్మల్ని ఫేక్ రావుగా తెలంగాణ భావిస్తోంది.. కాంగ్రెస్ ఎంపీ ట్వీట్