Chandrababu : ప్రధాని మోడీ, నిర్మలా సీతారామన్‌కు చంద్రబాబు కృతజ్ఞతలు
ఏపీ రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు, పారిశ్రామిక రంగం, ఏపీలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించడం హర్షణీయం
- By Latha Suma Published Date - 04:31 PM, Tue - 23 July 24

Chandrababu: ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర బడ్జెట్(Central budget) పై స్పందించారు. ఆంధ్రప్రదేశ్(AP) అవసరాలను గుర్తించి, అందుకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు చేసినందుకు ప్రధాని నరేంద్రమోడికి(PM Modi), కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman)కు ఏపి ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్న అన్ని అన్నారు. ఏపీ రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు, పారిశ్రామిక రంగం, ఏపీలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించడం హర్షణీయం అని పేర్కొన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, ఏపి పునర్ నిర్మాణం దిశగా కేంద్రం అందిస్తున్న ఈ సహకారం ఎంతగానో ఉపకరిస్తుందని చంద్రబాబు వివరించారు. ఎంతో భరోసా అందించేలా ఉన్న ఇటువంటి ప్రగతిశీల బడ్జెట్‌ను సమర్పించినందుకు కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నానని తెలిపారు.
ఏపికి కేంద్ర బడ్జెట్ లో కేటాయింపులు ఇవే..
. ఈ ఆర్థిక సంవత్సరంలో అమరావతికి రూ.15 వేల కోట్ల ప్రత్యేక సాయం
. అవసరమైతే వివిధ ఏజెన్సీల ద్వారా మరిన్ని నిధుల కేటాయింపు
. పోలవరం ప్రాజెక్టుకు సహాయ సహకారాలు
. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ
. పారిశ్రామికాభివృద్ధికి తోడ్పాటు అందించే విద్యుత్, రైల్వే, నీటి ప్రాజెక్టులకు నిధులు మంజూరు
. విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా రాయలసీమ, కోస్తాంధ్రలో వెనుకబడిన ప్రాంతాలకు గ్రాంట్‌లు
. విశాఖ-చెన్నై కారిడార్ లో కొప్పర్తికి ప్రాధాన్యం
Read Also: Rahul Gandhi : కుర్చీ కాపాడుకునేందుకే ఈ బడ్జెట్