Chandrababu: కేశినేని అడ్డాలో నేడు చంద్రబాబు పర్యటన, పెద్ద ఎత్తున జన సమీకరణ
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం యాత్రలో భాగంగా ఆదివారం కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన సందర్భంగా పామర్రు, ఉయ్యూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు
- Author : Praveen Aluthuru
Date : 07-04-2024 - 2:14 IST
Published By : Hashtagu Telugu Desk
Chandrababu: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం యాత్రలో భాగంగా ఆదివారం కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన సందర్భంగా పామర్రు, ఉయ్యూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు చంద్రబాబు పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో పర్యటించిన చంద్రబాబు నిన్న పల్నాడు జిల్లాలో నిర్వహించిన ప్రజాగళం యాత్రలో పాల్గొన్నారు
పామర్రు, ఉయ్యూరులో జరిగే బహిరంగ సభలకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చే అవకాశం ఉంది. ఇందుకోసం టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో పామర్రు వ్యవసాయ మార్కెట్ యార్డుకు చంద్రబాబు చేరుకుంటారు. పామర్రు ప్రధాన రహదారిపై సాయంత్రం 4 గంటలకు రోడ్‌షో నిర్వహించి బహిరంగ సభ నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 6 నుంచి 7:30 గంటల వరకు మరో రోడ్ షో, బహిరంగ సభ కోసం ఉయ్యూరుకు చేరుకుంటారు.
We’re now on WhatsApp. Click to Join
నియోజవర్గానికి చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో కేశినేని శివనాథ్ (చిన్ని) సుజనా చౌదరితో కలిసి దాసాంజనేయ స్వామి దేవస్థానాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. దానికి ముందు భవానీపురం 40వ డివిజన్‌లో స్థానిక నాయకులు, స్థానికుల నుంచి ఘనస్వాగతం లభించింది. కాగా పశ్చిమ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ-బీజేపీ-జనసేన అభ్యర్థులు గెలుపుపై ధీమాతో ఉన్నారు. ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరి భారీ మెజారిటీతో గెలుస్తారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. సుజానా చౌదరి మాట్లాడుతూ తాను, కేశినేని చిన్నికలిసి డబుల్ ఇంజన్ ఏర్పాటు చేసి పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.