HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Chandrababu Ready To Shock Tdp Mla

TDP MLA: టీడీపీ ఎమ్మెల్యేకు షాక్ ఇవ్వ‌టానికి సిద్ధ‌మైన చంద్ర‌బాబు..?

తిరువూరులో స‌ర్పంచ్‌ను తిట్ట‌డంతో అత‌ని భార్య సూసైడ్ అటెంప్ట్ చేయ‌టం, జ‌ర్న‌లిస్టుల‌పై అనుచితంగా మాట్లాడ‌టం, ప్ర‌త్య‌ర్థుల‌పై ఎమ్మెల్యే చేస్తున్న వ్యాఖ్య‌ల‌తో ఇటు అధిష్టానానికి మింగుడుప‌డ‌లేకుండా ఉంది.

  • Author : Gopi Date : 03-10-2024 - 1:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telugu Desam Party
Telugu Desam Party

TDP MLA: ఇటీవ‌ల జ‌రిగిన ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ కూట‌మి 164 సీట్లు గెలిచి అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే గెలిచిన త‌ర్వాత కొంత‌మంది టీడీపీ ఎమ్మెల్యేల తీరు వివాదాస్ప‌దం అవుతోంది. అందులో ముఖ్యంగా తిరువురూ ఎమ్మెల్యేగా మొద‌టిసారి గెలిచిన కొలిక‌పూడి శ్రీనివాస‌రావు ఏదీ చేసిన అది టీడీపీ అధిష్టానానికి త‌ల‌నొప్పిగా మారుతోంది. ఎన్నిక‌ల స‌మ‌యంలోనే అనేక చీవాట్లు తిన్న కొలిక‌పూడి ఎమ్మెల్యే (TDP MLA)గా విజ‌యం సాధించిన త‌ర్వాత త‌న న‌డ‌వ‌డిక ఏదీ మార్చుకున్న‌ట్లు క‌నిపించ‌టంలేదు. దీంతో కొలిక‌పూడికి ఝ‌ల‌క్ ఇవ్వ‌టానికి స్వ‌యంగా సీఎం చంద్ర‌బాబే రంగంలోకి దిగిన‌ట్లు స‌మాచారం అందుతోంది.

తిరువూరులో స‌ర్పంచ్‌ను తిట్ట‌డంతో అత‌ని భార్య సూసైడ్ అటెంప్ట్ చేయ‌టం, జ‌ర్న‌లిస్టుల‌పై అనుచితంగా మాట్లాడ‌టం, ప్ర‌త్య‌ర్థుల‌పై ఎమ్మెల్యే చేస్తున్న వ్యాఖ్య‌ల‌తో ఇటు అధిష్టానానికి మింగుడుప‌డ‌లేకుండా ఉంది. అయితే ఎమ్మెల్యే తీరుపై సొంత నియోజ‌క‌వ‌ర్గంలోని పార్టీ కార్య‌క‌ర్త‌లే అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే ఇంతా చేస్తున్న సీఎం చంద్ర‌బాబు ఎందుకు మౌనంగా ఉన్నారు..? అని సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌శ్నిస్తున్నారు. నేప‌థ్యంలోనే ఎమ్మెల్యే కొలిక‌పూడికి షాక్ ఇచ్చేందుకు సీఎం చంద్ర‌బాబు, టీడీపీ అధిష్టానం సిద్ధ‌మైనట్లు తెలుస్తోంది.

Also Read: Secunderabad Railway Station : విమానాశ్రయ తరహా సౌకర్యాలతో ప్రపంచ స్థాయికి చేరనున్న సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌

ఈ నేప‌థ్యంలోనే రంగంలోకి దిగిన సీఎం చంద్ర‌బాబు ఎమ్మెల్యే కూడా ఊహించ‌ని స్థాయిలో షాక్ ఇవ్వ‌బోతున్న‌ట్లు అర్థ‌మ‌వుతోంది. తాజా వివాదాల నేప‌థ్యంలో తిరువూరు టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా ఎమ్మెల్యే కొలికపూడి స్థానంలో మ‌రొక కీల‌క నేత‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇక‌పై ఆయ‌నే నియోజ‌క‌వ‌ర్గ బాధ్య‌త‌ల‌ను చూడ‌నున్న‌ట్లు స‌మాచారం. ఎమ్మెల్యే కొలిక‌పూడి స్థానంలో శావ‌ల దేవ‌ద‌త్ తిరువూరు టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా ఉండ‌నున్న‌ట్లు దేవ‌దతే స్వ‌యంగా చెప్ప‌డం గ‌మ‌నార్హం. అయితే దేవ‌ద‌త్ మాట‌ల వెన‌క టీడీపీ అధిష్ఠానం ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది. ఆయ‌న‌కు భ‌రోసా ఇవ్వ‌నిదే అంత బ‌హిరంగంగా చెప్ప‌ర‌ని పార్టీ కార్య‌క‌ర్త‌లు సైతం చ‌ర్చించుకుంటున్నారు. ఒక‌వేళ ఇదే గ‌నుక జ‌రిగితే ఒక ఎమ్మెల్యే ఉండగా మ‌రో వ్య‌క్తికి నియోజ‌క‌వ‌ర్గ బాధ్య‌త‌లు అప్ప‌గిస్తే అది రాష్ట్రంలో సంచ‌ల‌నంగా మారే అవ‌కాశం ఉంది. దీనిపై ఎమ్మెల్యే కొలిక‌పూడి, ఆయ‌న అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి మరీ.!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap politics
  • CM Chandrababu
  • MLA Kolikapudi Srinivasa Rao
  • NTR Dist
  • tdp mla
  • tiruvuru
  • TTD Laddu issue
  • YCP vs TDP

Related News

TDP Mahanadu 2026 Event In Nellore

Mahanadu: నెల్లూరులో టీడీపీ మహానాడు.. వేదిక ఖరారు!

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) వార్షిక మహానాడుకు వేదిక, తేదీలు ఖరారయ్యాయి. ఈ ఏడాది మహానాడును శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. మే 27, 28, 29 తేదీల్లో మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. పార్టీ చరిత్రలో నెల్లూరు జిల్లాలో మహానాడు నిర్వహించడం ఇదే ప్రథమం. మహానాడు వేదికగా నెల్లూరు జిల్లాలోని కొడవలూరు మండలంలో ఉన్న ఇఫ్కో కిసాన్ స్పెషల్ ఎక

    Latest News

    • Faria Abdullah: పెళ్లిపై ఫరియా అబ్దుల్లా షాకింగ్ కామెంట్స్

    • Pm Modi: బంగారం కొనడం ఆపేయండి.. ప్రధాని మోదీ విజ్ఞప్తి…

    • Tamil Politics: విజయ్ ప్రమాణ స్వీకారంలో వివాదం ?

    • Flaxseed: రోజూ అవిసె గింజల పొడి తింటే కలిగే లాభాలు ఇవే…!

    • IPL 2026: ప్లేఆఫ్స్ రేసు మరింత రసవత్తరం.. టాప్ 4 చేరేదెవ్వరు?

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd