Chandrababu Naidu : టీడీపీకి లోక్‌సభ స్పీకర్ పదవి.. చంద్రబాబు ప్రపోజల్ ?
ఎన్డీయే ప్రభుత్వంలో ఈసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చక్రం తిప్పనున్నారు.
- By Pasha Published Date - 11:42 AM, Wed - 5 June 24

Chandrababu Naidu : ఎన్డీయే ప్రభుత్వంలో ఈసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చక్రం తిప్పనున్నారు. ఆయనకు మంగళవారం మధ్యాహ్నమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ కాల్ చేసి మాట్లాడారని తెలుస్తోంది. తమ కూటమిలోనే కొనసాగాలని.. కీలకమైన పదవిని కేంద్రంలో ఇస్తామని హామీ ఇచ్చినట్టు మీడియాలో చర్చ జరుగుతోంది. ఈనేపథ్యంలో ఇవాళ జాతీయ మీడియాలో మరో అంశం తెరపైకి వచ్చింది. ఇవాళ మధ్యాహ్నం 1 గంటలకు ఢిల్లీలో జరగనున్న ఎన్డీయే కూటమి సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొంటారని ఆ కథనంలో చెప్పారు. లోక్‌సభ స్పీకర్ పదవిని కీలకమైన మిత్రపక్షంగా ఉండబోతున్న టీడీపీకి కేటాయించాలని చంద్రబాబు కోరనున్నట్లు అందులో ప్రస్తావించారు.
We’re now on WhatsApp. Click to Join
లోక్‌సభ స్పీకర్ పదవిని టీడీపీకి ఇచ్చేందుకు బీజేపీ ఇష్టపడుతుందా ? లేదా ? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ ఈ ప్రతిపాదనను బీజేపీ పెద్దలు తిరస్కరిస్తే చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఎవరూ ఊహించలేకపోతున్నారు. ఏదైనా కేంద్రమంత్రి పదవితో చంద్రబాబు అడ్జస్ట్ అవుతారా ? ఇండియా కూటమి వైపు నుంచి వచ్చే మరేదైనా పెద్ద ఆఫర్‌ను స్వీకరించేందుకు మొగ్గుచూపుతారా ? అనేది వేచిచూడాలి.ఏపీ అసెంబ్లీ పోల్స్‌లో మొత్తం 175 స్థానాలకుగానూ 135 చోట్ల టీడీపీ గెలిచింది. ఇక 16 లోక్‌సభ స్థానాలను కూడా టీడీపీ సాధించింది.
Also Read :Muslim MPs : ఈసారి 15 మంది ముస్లింలు లోక్‌సభకు..
ఇక బిహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ కూడా బీజేపీ ఎదుట కీలకమైన ప్రపోజల్స్ పెట్టే అవకాశం ఉంది. ఆయన కూడా కేంద్రంలో కీలక పదవిని డిమాండ్ చేసే ఛాన్స్ లేకపోలేదు. ఒకవేళ బీజేపీ ససేమిరా అంటే.. జంపింగ్ జపాంగ్‌లకు కేరాఫ్ అడ్రస్ అయిన నితీష్ కుమార్ అనూహ్య నిర్ణయాలు తీసుకునేందుకు వెనుకాడరు అని పరిశీలకులు అంటున్నారు. ఇక ఉత్తర భారత దేశంలో ఎన్డీయే కూటమిని గట్టెక్కించిన కీలక రాష్ట్రం బిహార్. ఇక జేడీయూ 12 స్థానాలను, బీజేపీ 12 స్థానాలను గెల్చుకున్నాయి.