HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Chandrababu Naidu Is Serious About Tdp Mla Aravinda Babus Behavior

Chandrababu Naidu: టీడీపీ ఎమ్మెల్యే అరవింద బాబు తీరుపై చంద్రబాబు సీరియస్

  • Author : Vamsi Chowdary Korata Date : 04-04-2026 - 12:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
TDP MLA Chadalavada Aravinda Babu
TDP MLA Chadalavada Aravinda Babu

Chadalavada Aravinda Babu పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు వ్యవహారశైలిపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు.

వివరాల్లోకి వెళితే… నరసరావుపేట ఎమ్మెల్యే అరవిందబాబు పల్నాడు ఎస్పీ కార్యాలయంలో దాదాపు 10 గంటల పాటు బైఠాయించడం వివాదానికి కేంద్రబిందువైంది. జిల్లా పోలీస్ సెల్ న్యాయ సలహాదారుగా తాను సిఫారసు చేసిన రామినేని ప్రసాద్ పేరును ఎందుకు ఆమోదించలేదని ఎస్పీ బి.కృష్ణారావును అరవిందబాబు నిలదీశారు. ఎస్పీ వివరణ ఇచ్చినా వినకుండా, నియామక ఉత్తర్వుల కాపీ చేతికి వచ్చేవరకు కదిలేది లేదని ఎస్పీ ఛాంబర్‌లోనే కూర్చున్నారు. మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత కార్యాలయాల నుంచి ఫోన్లు వచ్చినా ఎమ్మెల్యే తన పంతం వీడకపోవడం చర్చనీయాంశమైంది.

ఈ వ్యవహారంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. “వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీ గౌరవాన్ని పణంగా పెట్టేది లేదు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే పునరాలోచన లేకుండా సస్పెండ్ చేస్తా. రాజకీయాల్లో సుదీర్ఘ కాలం ఉండాలనుకుంటున్నారా? లేక ఒక్కసారే ఎమ్మెల్యేలుగా మిగిలిపోవాలనుకుంటున్నారా? మీరే తేల్చుకోవాలి” అంటూ హెచ్చరించారు. ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి తేవడం, కార్యాలయాల్లో బైఠాయించడం వంటి చర్యలు ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తాయని, ఇలాంటి వాటిని భరించే ప్రసక్తే లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh politics
  • AP CM Chandrababu Naidu
  • Chadalavada Aravinda Babu
  • Narasaraopet MLA
  • palnadu
  • Suspension Warning

Related News

Good news for the unemployed in AP: Green signal given to fill job vacancies in the Electricity Department.

APSPDCL: ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. విద్యుత్ శాఖలో ఉద్యోగాలు భర్తీకి గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిధిలోని విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది, ప్రస్తుతం దరఖాస్తుల ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది. మొత్తం 629 ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ ప్రకటన వెలువడింది. వివిధ ప్రభుత్వ విద్యుత్ సంస్థల వారీగా విభజించిన ఈ ఖాళీలలో.. ఏపీ ట్రాన్స్‌కో (AP Transco) లో అత్యధికంగా 200 పోస్టులు ఉన్నాయి. వీటి

    Latest News

    • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

    • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

    • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

    • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

    • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd