AP Politics: షర్మిలకు ఆస్థి ఇవ్వకుండా తరిమేశాడు
ఏపీలో ఎన్నికలకు తక్కువ సమయం ఉండటంతో ప్రతిపక్షాలు, అధికార పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఓ వైపు నారా లోకేష్ యువగలం పేరుతో పాదయాత్ర మొదలుపెట్టాడు.
- By Praveen Aluthuru Published Date - 01:55 PM, Thu - 3 August 23

AP Politics: ఏపీలో ఎన్నికలకు తక్కువ సమయం ఉండటంతో ప్రతిపక్షాలు, అధికార పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఓ వైపు నారా లోకేష్ యువగలం పేరుతో పాదయాత్ర మొదలుపెట్టాడు. మరోవైపు చంద్రబాబు పబ్లిక్ మీటింగుల్లో సీఎం జగన్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా చంద్రబాబు పులివెందులలో పర్యటించారు.
పులివెందుల పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు బాబు నాయుడు సీఎం జగన్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. చెల్లిన మోసం చేసి, తరిమేశాడంటూ ఎద్దేవా చేశారు. పబ్లిక్ మీటింగ్ లో చంద్రబాబు మాట్లాడుతూ.. జగన్ జైలులో ఉండి శరదల(షర్మిల)తో పాదయాత్ర చేయించి ఊరూరా తిప్పించాడని గుర్తు చేశారు. ఎంపీ సీటిస్తానని మాటిచ్చి చెల్లిని మోసం చేశాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆస్తిలో వాటా ఇద్దరికీ రాస్తే చెల్లిని తరిమేసి తానొక్కడే అనుభవిస్తున్నాడని ఆరోపించారు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీరామారావు ఆస్తిలో సమన హక్కు చట్టం తీసుకొచ్చారని, అయితే ఆస్తిలో సగ భాగం తనకి చెల్లాల్సి ఉందని, అయినా ఇవ్వకుండా మోసం చేశాడని ఆరోపించారు. పులివెందుల ఆడబిడ్డకు అన్యాయం జరిగిందని, దీంతో ఆమె తెలంగాణ రాజకీయాల్లోకి వెళ్లిందని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు.
Also Read: Y Not 160 : వైనాట్ పులివెందుల గర్జన వెనుక కొదమసింహం