NTR Currency: ఎన్టీఆర్ పేరుతో కేంద్రం నాణెం విడుదల
భారత ప్రధాని నరేంద్ర మోదీకి టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత, నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు.
- Author : CS Rao
Date : 29-03-2023 - 8:30 IST
Published By : Hashtagu Telugu Desk
NTR Currency : భారత ప్రధాని నరేంద్ర మోదీకి టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత, నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా NTR పేరుతో ప్రత్యేక నాణెం విడుదల చేసే అంశం పై ధన్యవాదాలు తెలుపుతూ లేఖ ను పంపారు.

*శతజయంతి సందర్భంగా ప్రత్యేక నాణెం విడుదల చేయడం పై టీడీపీ పొలిట్ బ్యూరో మీకు ధన్యవాదాలు తెలిపింది.
- నాణెం విడుదల విషయంలో చొరవ తీసుకున్న కేంద్రానికి, మీకు ప్రత్యేక ధన్యవాదాలు
- నేడు హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన పోలిట్ బ్యూరో సమావేశం మీ నిర్ణయాన్ని స్వాగతించింది.
- నాణేన్ని విడుదల చేయడానికి 2023 మార్చి 20న గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసినందుకు మీ నాయకత్వంలోని భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ పొలిట్‌బ్యూరో తీర్మానం చేసింది.
- ఎన్టీఆర్ తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీక
- ఎన్టీఆర్‌ని సన్మానించడమంటే తెలుగు వారిని గౌరవించడమే.
- ఎన్టీఆర్ 100వ జయంతిని పురస్కరించుకుని నాణెం విడుదల చేస్తున్నందుకు తెలుగు ప్రజల తరపున, తెలుగుదేశం పార్టీ తరపున, వ్యక్తిగతంగా నా తరుపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
Also Read: TDP Foundation Day: 41 ఏళ్ల టీడీపీ ప్రస్థానం, NTR టు CBN