HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Center Not Serious On Special Railway Zone For Ap

AP Railway Zone : ఏపీ రైల్వే జోన్ కిరికిరి

ఇప్పటికే పోలవరం నిధులను తెగ్గోసిన కేంద్రం తాజాగా మరో సంచలన విషయాన్ని రైల్వే బోర్డు ద్వారా చెప్పించింది.

  • Author : CS Rao Date : 29-09-2022 - 11:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vizag
Vizag

ఇప్పటికే పోలవరం నిధులను తెగ్గోసిన కేంద్రం తాజాగా మరో సంచలన విషయాన్ని రైల్వే బోర్డు ద్వారా చెప్పించింది. ఏపీలోనివిశాఖకు కొత్తగా రైల్వే జోన్ ఇచ్చే ప్రతిపాదన ఏదీ లేదని తెగేసి చెప్పింది. రాష్ట్ర విభజన చట్టం-2014లోని అంశాలపై కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాలతో నూ కేంద్రం తాజాగా చర్చలు ప్రారంభించింది. దీనిలో ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.ఈ క్రమంలో రైల్వే బోర్డు చైర్మన్ ఏపీలోని విశాఖలో రైల్వే బోర్డ్ ఏర్పాటు చేసే యోచన లేదన్నారు. దీనిపై హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “ ఈ విషయాన్ని కేంద్ర మంత్రి వర్గానికి వదిలేయండి. దీనిపై తర్వాత చర్చిద్దాం“ అని బోర్డు చైర్మన్కు భల్లా చెప్పారు. మొత్తం 14 అంశాలతో కూడిన అజెండాపై తాజాగా చర్చ జరుగుతోంది. వీటిలో ఏపీలో కొత్త రాజధానికి నిధులు ఏడు వెనుక బడిన జిల్లాలకు నిధులు విద్యాసంస్థల ఏర్పాటు సహా రైల్ ర్యాపిడ్ కనెక్టివిటీ వంటివి ఉన్నాయి. ఈ క్రమంలో ఏపీ తరఫున సమావేశానికి హాజరైన సీఎస్ సమీర్ శర్మ కొత్త రాజధాని నిర్మాణానికి రూ.1000 కోట్లు కావాలని విన్నవించారు. అమరావతి అభివృద్ధికి ఆ నిధులు వెచ్చిస్తామన్నారు. అయితే, కేంద్ర అధికారులు మాత్రం గతంలో ఇచ్చిన 1500 కోట్ల లెక్కలు చెప్పాలని వాటి వివరాలు ఇవ్వాలని మెలిక పెట్టారు. ఇదిలావుంటే రాజధానిపై ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ ఏపీ రాజధానికి రూ.29 వేల కోట్లు ఇవ్వాలని సూచించిన విషయాన్ని ఏపీ అధికారులు లేవనెత్తారు.

విభజన హామీల్లో కీలకమైన రైల్వే జోన్ వ్యవహారంపై మాత్రం రైల్వే బోర్డ్ తిప్పేసినట్టు తెలుస్తోంది. కొన్నేళ్లుగా ఈ డిమాండ్ పెండింగులోనే ఉంది. ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో కూడా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ దీనిపై ఒక ప్రకటన చేశారు. రైల్వే జోన్ కోసం స్థలాన్ని వెతుకుతున్నామని ప్రకటించారు. అన్నీ జరుగుతాయని కూడా హామీ ఇచ్చారు.కానీ ఇంతలో బోర్డు మాత్రం ప్లేట్ ఫిరాయించడం గమనార్హం. మంత్రి ప్రకటన తర్వాత విశాఖ రైల్వే జోన్పై మళ్లీ ఆశలు చిగురించాయి. అయితే. ఇప్పుడు బోర్డు తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు తెలుస్తోంది. విశాఖలోల రైల్వే జోన్ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని, పేర్కొన్నారు. మరోవైపు ఏపీ తెలంగాణల నుంచి వచ్చిన కొన్ని అభ్యర్థలను కేంద్ర హోం శాఖ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. రెండు గంటల సమావేశంలో ఎలాంటి హామీలు దక్కక పోవడం తో ఇరు రాష్ట్రాల అధికారులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. రైల్వే జోన్ రాజకీయ చర్చకు దారితీసింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఒకటి చెబుతుంటే, జేవీయల్ మరొకటి అంటున్నారు. బీజేపీ, వైసీపీ పొలిటికల్ గేమ్ నడుమ విశాఖ రైల్వే జోన్ ఒక జోక్ గా మారింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap news
  • ap railway zone
  • Visakhapatnam

Related News

Pandu Master Health Update

Pandu Master: పండు మాస్టర్ హెల్త్ అప్డేట్..

రోడ్డు ప్రమాదంలో గాయపడిన పండు మాస్టర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో విశాఖ మెడికవర్ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. పండు మాస్టర్‌కు రెండు కాళ్లకు తీవ్రంగా గాయాలయ్యాయని, ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని మెడికవర్ ఆస్పత్రి వైద్యులు ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఈ రోజు ఆపరేషన్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆపరేషన్ తర్వాత ఆరు నెలల పాటు విశ్రాంతి అవసరమని సూచించారు. డ్యా

  • 'Dhee' Fame Pandu Master Involved in Horrific Road Accident

    Dhee Pandu Master: ఢీ ఫేమ్ పండు మాస్టర్‌కు ఘోర రోడ్డు ప్రమాదం

Latest News

  • Visakhapatnam Steel Plant: కన్నీళ్లు పెట్టిస్తున్న స్టీల్ ప్లాంట్ బాధితుడు.. తమ్ముడిని, అమ్మను జాగ్రత్తగా చూసుకో డాడీ

  • Hardik Pandya: ఆఫ్గన్‌తో వన్డే సిరీస్‌ కు ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా ఫిట్‌

  • Pawan Kalyan: స్టీల్‌ ప్లాంట్‌ ఘటన..బాధితులకు పరామర్శ పవన్‌ కల్యాణ్‌

  • Chandrababu Naidu: ఢిల్లీకి సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్.!

  • Visakhapatnam Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించిన మంత్రి నారా లోకేష్

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd