HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Campaign About Vangaveeti Radhas Political Future What Is His Future Plan

Vangaveeti Radha: ఫ్యూచర్‌ ప్లాన్.. వంగవీటి రాధ నిర్ణయం అదేనా ?

విజయవాడకు చెందిన వంగవీటి రాధ(Vangaveeti Radha) మిత్రుడు ఒకరు మీడియాతో మాట్లాడుతూ ఇదే విషయాన్ని చెప్పారు.

  • Author : Pasha Date : 22-03-2025 - 2:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vangaveeti Radha Ap Politics Tdp

Vangaveeti Radha: వంగవీటి రాధ ఏం చేయబోతున్నారు ? ఆయన పొలిటికల్ ఫ్యూచర్ ప్లాన్ ఏమిటి ? అనే దానిపై ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ డిబేట్ నడుస్తోంది.  వంగవీటి రాధ 2009లో వైఎస్సార్  సీపీలో చేరారు. 2019 ఎన్నికలకు ముందు ఆయన టీడీపీ గూటికి చేరారు. అయితే అప్పుడు కూడా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కలేదు. టీడీపీ గెలిస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తారని అంతా అనుకున్నారు. కానీ అప్పట్లో టీడీపీ అధికారంలోకి రాలేదు. 2019 నుంచి 2024 వరకు వంగవీటి రాధ టీడీపీలోనే కొనసాగారు.2024 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయనకు పోటీ చేసే అవకాశం దక్కలేదు. అయినా టీడీపీ కోసం ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో ముమ్మర ప్రచారం చేశారు. కాపులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రాధా ఎన్నికల ప్రచారం సాగింది. జనసేన, టీడీపీ, బీజేపీలతో కూడిన కూటమి ఏపీలో అధికారంలోకి వచ్చింది. అయినా నేటికీ వంగవీటి రాధకు ఏ పోస్టూ రాలేదు. ఆయనను రాజ్యసభకు పంపుతారనే ప్రచారం జరుగుతున్నా.. ఆ దిశగా సానుకూల సంకేతాలు కనిపించడం లేదు.

Also Read :Shah Rukh Message: కోల్‌కతా నైట్ రైడర్స్‌కు షారుక్ కీలక సందేశం

పార్టీలు మారినా పదవులు దక్కలేదని.. 

అటు వైఎస్సార్ సీపీలో ఉండగా.. ఇటు టీడీపీలో ఉండగా వంగవీటి రాధకు పదవులు ఏవీ దక్కలేదు. దీంతో నైరాశ్యానికి గురైన ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటే మంచిదని అనుకుంటున్నట్లు పలువురు ప్రచారం చేస్తున్నారు. అయితే ఇందులోని వాస్తవికతను మేం ధ్రువీకరించడం లేదు. రాజకీయాలను ఇక వదులుకుంటానని ఏ సందర్భంలోనూ వంగవీటి రాధ స్వయంగా వెల్లడించలేదు. సొంత అంచనాలతో టీడీపీ వ్యతిరేక మీడియా ఈ తరహా కథనాలను వండివారుస్తోంది. టీడీపీ నేతలు, క్యాడర్ గురించి తప్పుడు ప్రచారానికి పూనుకుంటోంది. వాస్తవానికి ఈసారి కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ క్యాడర్, నేతలు జోష్‌లోనే ఉన్నారు. సీఎం చంద్రబాబు, నారా లోకేష్ సారథ్యంలో ప్రజలతో మరింతగా మమేకం అవుతున్నారు. టీడీపీ కోసం నిబద్ధతతో పనిచేసే వారికి తగిన అవకాశాలను కల్పించే విషయంలో చంద్రబాబు, లోకేష్ ఎన్నడూ వెనుకాడలేదు. కొన్నిసార్లు పలుచోట్ల నేతలకు కీలక అవకాశాలను కల్పించడంలో కొంత జాప్యం జరుగుతుంటుంది. దాన్ని ఉద్దేశపూర్వక చర్యగా పేర్కొంటూ తప్పుడు కథనాలను ప్రచురించడం సరికాదు అని టీడీపీ అగ్రనేతలు అంటున్నారు.

క్లారిటీ ఇచ్చిన వంగవీటి రాధ మిత్రుడు 

విజయవాడకు చెందిన వంగవీటి రాధ(Vangaveeti Radha) మిత్రుడు ఒకరు మీడియాతో మాట్లాడుతూ ఇదే విషయాన్ని చెప్పారు. ‘‘రాధా రాజకీయాలకు దూరం కాలేదు. ఆయనకు అలాంటి ఆలోచనేం లేదు. టీడీపీలో చాలా కంఫర్ట్‌గా ఉన్నారు. రాధాకు ఎప్పుడు ఏ పదవి ఇవ్వాలో పార్టీ నిర్ణయిస్తుంది. అప్పటివరకు ఓపికగా ఉంటాం. కొందరు ఈవిషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అనారోగ్య సమస్యల వల్ల కొంతకాలం యాక్టివ్‌గా లేరు అంతే’’ అని రాధ మిత్రుడు తేల్చి చెప్పారు.

Also Read :Earth Hour 2025 : గంటసేపు లైట్లు ఆపేయండి.. చంద్రబాబు ట్వీట్.. కారణమిదీ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap politics
  • congress
  • Janasena
  • tdp
  • vangaveeti radha
  • Vangaveeti Radha Krishna
  • ysrcp

Related News

Revanth Speech

CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

తెలంగాణలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అంశం మరోసారి రాజకీయ చర్చకు కేంద్రబిందువైంది. ఉచిత విద్యుత్, వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్ల వ్యవహారంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి.  ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా కొనసాగుతుందనితేల్చి చెప్పారు.ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభు

  • NRI TDP

    TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

  • Jaggareddy

    TPCC : హైదరాబాద్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిసిన జగన్నారెడ్డి

  • Indiramma Houses

    CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

  • Dk Shivakumar

    Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

Latest News

  • Congress : ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణ రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చ

  • Bengaluru : మటన్ పేరుతో బీఫ్ విక్రయం?.. బెంగళూరులో ఇద్దరు రెస్టారెంట్ యజమానుల అరెస్ట్

  • IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

  • Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

  • Health : హైబీపీ – సైలెంట్ కిల్లర్‌ను నిర్లక్ష్యం చేయకండి – డా. చింతా ప్ర‌భాక‌ర్ రెడ్డి

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd