CBN : బాబు అరెస్ట్‌పై ఏపీలో నిరసనలు ఏవీ..? టీడీపీ ప్రోగ్రాం కమిటీ కార్యక్రమాలపై క్యాడర్ అసంతృప్తి
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌పై ఏపీలో నిరసనలు నామమత్రంగానే జరుగుతున్నాయి.
- Author : Prasad
Date : 29-10-2023 - 8:13 IST
Published By : Hashtagu Telugu Desk
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌పై ఏపీలో నిరసనలు నామమత్రంగానే జరుగుతున్నాయి. తెలంగాణలో టీడీపీ కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులు బాబుకు మద్దతుగా వినూత్నంగా నిరసలు చేపట్టి సక్సెస్ చేస్తున్నారు. ఏపీలో మాత్రం తమకు ఏమీ పట్టనట్లు నాయకులు వ్యవహరిస్తున్నారు. ఏదో ఆదివారం సాయంత్రం ఒక కార్యక్రమం పేరుతో ఐదు నిమిషాలు వీడియో తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తప్ప ఏ ఒక్క నిరసన కార్యక్రమం సక్సెస్ కాలేదు. టీడీపీ ప్రోగ్రాం కమిటీ ఇచ్చే కార్యక్రమాలపై క్యాడర్ తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. కళ్లు తెరిపిద్దాం.. మోతమెగిద్దాం, చేతులు కట్టుకుందాం అంటూ చప్పట్లు, కళ్లుగంతలు కట్టుకునే కార్యక్రమాలకు అధిష్టానం పిలుపునివ్వడంపై కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు. ఇలాంటి చెత్త ప్రోగ్రాంలు చేసి నవ్వులు పాలు అవ్వడం తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదని క్యాడర్‌లో వినిపిస్తుంది. ధర్నాలు, ఆందోళనలు గట్టిగా చేయాలని లేకుంటే ఆ ప్రభుత్వానికి వినిపించదంటూ క్యాడర్‌లో టాక్ వినిపిస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
టీడీపీలో ఒకరు ఇద్దరు మినహా మిగిలిన నేతలంతా పార్టీ కేంద్ర కార్యాలయంకి వచ్చి నాలుగు ప్రెస్‌మీట్లు పెట్టి ఏసీ రూమ్‌లు కూర్చుని సాయంత్రానికి ఇంటికి వెళ్లిపోవడం తప్ప ఎలాంటి కార్యచరణ రూపొందించడంలేదని టీడీపీ క్యాడర్‌లో వినిపిస్తుంది. కార్యక్రమాలు చేస్తే ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుందంటూ నాయకులు భయపడతున్నారని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అధినేత చంద్రబాబు సైతం జైల్లో 50 రోజులుగా ఉంటుంటే.. నాయకులు నాలుగు రోజులు జైల్లో ఉండటానికి ఎందుకంతా భయమంటూ క్యాడర్ ప్రశ్నిస్తుంది. చంద్రబాబు జైల్లో ఉండి అనారోగ్యంతో ఉంటే బయట పదవులు పొందిన నాయకులు మాత్రం టెంట్‌ల కింద ఫ్యాన్లు, ఏసీలు పెట్టుకుని ధర్నాలు చేస్తున్నారని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా టీడీపీ ప్రోగ్రాం కమిటీ చెత్త కార్యక్రమాలను రూపొందించకుండా ప్రభుత్వాన్ని వణికించేలా కార్యక్రమాలకు పిలుపునివ్వాలని క్యాడర్ కోరుతుంది.
Also Read: CBN Gratitude Concert : చంద్రబాబు ఘనతకు చరిత్రే సాక్ష్యం.. ‘సీబీఎన్ గ్రాటిట్యూడ్ కాన్సెర్ట్’ నేడే !