HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Brs To Contest On All 175 Seats In Andhra Pradesh

BRS: వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో బీఆర్‌ఎస్ పోటీ.. ప్రత్యామ్నాయ పార్టీగా సీఎం కేసీఆర్ పార్టీ..!

ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 175 స్థానాల్లో బీఆర్‌ఎస్ (BRS) పోటీ చేస్తుందని ఆంధ్రప్రదేశ్ భారత రాష్ట్ర సమితి (BRS) చీఫ్ తోట చంద్రశేఖర్ (Thota Chandrasekhar) ఆదివారం తెలిపారు.

  • Author : Gopi Date : 10-04-2023 - 8:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
BRS
Resizeimagesize (1280 X 720) 11zon

ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 175 స్థానాల్లో బీఆర్‌ఎస్ (BRS) పోటీ చేస్తుందని ఆంధ్రప్రదేశ్ భారత రాష్ట్ర సమితి (BRS) చీఫ్ తోట చంద్రశేఖర్ (Thota Chandrasekhar) ఆదివారం తెలిపారు. మీడియా సమావేశంలో తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మా పార్టీ మొత్తం 175 స్థానాల్లో పోటీ చేస్తుందన్నారు. రాష్ట్రంలోని మొత్తం 25 పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి కూడా పోటీ చేస్తామని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ (AndhraPradesh)ని ప్రత్యేక హోదా పరిధిలోకి తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిందేమీ లేదని ఆయన అన్నారు.

‘ప్రత్యేక హోదాపై సీఎం జగన్ గానీ, మాజీ సీఎం చంద్రబాబు గానీ ఏమీ చేయలేదు. ప్రధాని మోదీతో స్నేహంగా ఉంటూ జగన్ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించలేకపోయారు. ఆంధ్రప్రదేశ్‌కి టీడీపీ, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ చేసిందేమీ లేదు. పోలవరం ప్రాజెక్టు సీరియస్ ఇష్యూ అని, రెండు పార్టీలు పట్టించుకోలేదన్నారు. మా పార్టీ దీనిని తీవ్రమైన సమస్యగా పరిగణిస్తోంది’ అని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా బీఆర్‌ఎస్‌ అవతరిస్తుందని అన్నారు.

Also Read: BRS: ఈ నెల 27న బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలు..!

బీఆర్‌ఎస్ పార్టీ కేవలం గోదావరి జిల్లాల్లోనే కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్‌లో తన ప్రభావాన్ని చూపుతుంది. గోదావరి జిల్లాల నుంచి కార్యకర్తలు పెద్దఎత్తున బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్నారు. ఆదివారం విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించి కార్యకర్తలతో సమావేశం నిర్వహించగా, బీఆర్‌ఎస్ కార్మికులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ) మళ్లీ అధికారంలోకి రాదని రాష్ట్ర శాసన మండలి ఎన్నికల ఫలితాలు స్పష్టంగా చెబుతున్నాయని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబు నాయుడు అంతకుముందు అన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra CM Jagan
  • andhra pradesh
  • brs
  • BRS Chief Thota Chandrasekhar
  • cm kcr
  • politics
  • tdp

Related News

Health Minister

AP : ఐదు బోధనాసుపత్రుల్లో కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు!

రాష్ట్రంలోని ఐదు బోధనాసుపత్రుల్లో తొలిసారిగా కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు రాబోతున్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. దివ్యాంగులకు అవసరమైన కృత్రిమ కాళ్లు, చేతులు, వీల్ ఛైర్లు, వినికిడి పరికరాలు, ఇతర సహాయ ఉపకరణాల తయారీ ఈ కేంద్రాల్లో జరుగుతాయని పేర్కొన్నారు. వైద్యులు సూచించే అవసరమైన కృత్రిమ కాళ్లు, చేతులు ఇవ్వడంవల్ల దివ్యాంగుల

  • CM Chandrababu's Remarks at the 7th Phase Collectors' Conference

    CM Chandrababu : మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం

  • CM Chandrababu

    CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

  • TDP

    TDP vs YSRCP : డీఎస్సీపై లోకేష్ సవాల్‌కు సమాధానం చెప్పే ధైర్యం జగన్‌కు ఉందా..?

  • South African star cricketer Jonty Rhodes met Minister Nara Lokesh.

    Jonty Rhodes: మంత్రి నారా లోకేశ్‌ను కలిసిన దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ జాంటీ రోడ్స్‌

Latest News

  • Nara Rohit: నారా వారి ఇంట మ‌రో వార‌సుడు.. మగబిడ్డకు జన్మనిచ్చిన నారా రోహిత్ భార్య శిరీష

  • Kodali Nani: ఏపీ హైకోర్టుకు మాజీ మంత్రి కొడాలి నాని

  • Rain Alert: తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్షసూచన

  • Plants: కుబేరుడికి ఎంతో ఇష్టమైన ఈ 3 చెట్లను ఇంట్లో ఈ దిక్కున నాటితే చాలు.. కాసుల వర్షం కురుస్తుంది.

  • Stock Market: స్టాక్ మార్కెట్ జోరు..లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd