HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Bravo Lokesh National Journalist Rajdeep Is Captivated A Shower Of Praise

Nara Lokesh: లోకేష్ శభాష్… జాతీయ జర్నలిస్ట్ రాజ్‌దీప్ ఫిదా.. ప్రశంసల వర్షం….!!

  • Author : Vamsi Chowdary Korata Date : 25-03-2026 - 11:59 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nara Lokesh
Nara Lokesh

Rajdeep Sardesai రాజకీయాల్లో హామీలు ఇవ్వడం సహజం, కానీ ఇచ్చిన మాటను తప్పకుండా అమలు చేయడం చాలా అరుదు. నారా లోకేష్ సరిగ్గా ఈ పని చేసి చూపించారు. రంజాన్ పర్వదినం సందర్భంగా ఓ ముస్లిం కుటుంబానికి ఏడాది క్రితం ఇచ్చిన హామీని నెరవేర్చి, వారి సొంతింటి కలను నిజం చేశారు. దేశంలో మతపరమైన విభజన పెరుగుతున్న తరుణంలో, ఓ నాయకుడు మతాలకు అతీతంగా ఇలాంటి గొప్ప పని చేయడంపై ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ ప్రశంసల వర్షం కురిపించారు.

లోకేష్ హామీ నెరవేర్చడంపై ప్రత్యేకంగా ట్వీట్ చేశారు రాజ్‌దీప్ సర్దేశాయ్. దేశవ్యాప్తంగా మతపరమైన విభజన రాజకీయాలు నడుస్తున్న వేళ, ఆంధ్రప్రదేశ్‌లో నారా లోకేష్ చేసిన ఈ పని సానుకూల మార్పుకు సంకేతమని విశ్లేషకులు అంటున్నారు. ఇచ్చిన మాట మరిచిపోకుండా, ముస్లిం కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇవ్వడం ద్వారా లోకేష్ మానవత్వాన్ని చాటుకున్నారని చెప్పారు.

ఇండియా టుడేలో ఓ ప్రత్యేక కథనం కూడా ప్రసారమైంది. రంజాన్ సమయంలో లోకేష్ చేసిన ఈ సహాయం ఓ వర్గానికి చేసిన మేలు మాత్రమే కాదని, సమాజంలో మత సామరస్యాన్ని పెంచే ప్రయత్నమని విశ్లేషకులు మెచ్చుకుంటున్నారు. ‘ప్రామిస్ మేడ్ – ప్రామిస్ ఫుల్‌ఫిల్డ్’ హ్యాష్‌ట్యాగ్‌తో ఈ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. జాతీయ స్థాయిలో లోకేష్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి.

గతేడాది రంజాన్ వేళ లోకేష్ ఓ నిరుపేద ముస్లిం ఇంటికి ఇఫ్తార్ విందుకు వెళ్లారు. ఆ సమయంలో ఆ కుటుంబం పడుతున్న ఇబ్బందులను, వారి ఇంటి పరిస్థితిని చూసి లోకేష్ చలించారు. ఆ కుటుంబ బాధ్యతను తానే తీసుకుంటానని, వారికి పక్కా ఇల్లు నిర్మించి ఇస్తానని లోకేష్ హామీ ఇచ్చారు. ఏడాది తిరగకముందే ఆ పేద కుటుంబానికి సొంతింటి కలను నిజం చేశారు. అన్ని సౌకర్యాలతో నిర్మించిన ఆ ఇంటిని చూసి ఆ ముస్లిం కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రంజాన్ పండుగ వేళ తమకు ఇంతటి గొప్ప బహుమతిని అందించిన మంత్రి లోకేష్‌కు వారు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • Journalist Rajdeep
  • Minister Nara lokesh
  • National Journalist
  • Rajdeep Sardesai

Related News

The people are the ultimate arbiters of a historic victory: Deputy CM Pawan.

Pawan Kalyan: ఈ చారిత్రక విజయానికి అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే : డిప్యూటీ సీఎం పవన్

ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయనిర్ణేతలు ప్రజలేనని, వారి తీర్పును మించిన శక్తి ఏదీ లేదని ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు కేవలం ప్రభుత్వ మార్పునకు మాత్రమే పరిమితం కాలేదని, రాష్ట్ర భవిష్యత్తుకు కొత్త దిశను నిర్దేశించిందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్నిర్మాణం కోసం ప్రజలు కూటమిపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున

  • CM Chandrababu is the person who made gems rain in Rayalaseema: Minister Nara Lokesh.

    Nara Lokesh: రాయలసీమలో రత్నాలు పడేలా చేసిన వ్యక్తి సీఎం చంద్రబాబు: మంత్రి నారా లోకేష్

  • Wishes pouring in for Balayya...

    Happy Birthday NBK: బాలయ్యకు వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు..

Latest News

  • Negative Energy: ఇలా చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బయటకు పోవడం ఖాయం..!!

  • Talliki Vandanam: ఆ రోజు మీ అకౌంట్ లోకి తల్లికి వందనం.. డేట్ ఫిక్స్

  • Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

  • 48 ఏళ్ల తర్వాత ఒక్కటైన జంట.. టాటూనే సాక్ష్యం

  • Dry Fruits: వామ్మో.. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే అంత ప్రమాదమా?

Trending News

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd