TTD Chairman : TTD ఛైర్మన్ గా బీఆర్ నాయుడు
TTD Chairman : కొత్త పాలక మండలిలో మొత్తం 24 మంది సభ్యులను ప్రభుత్వం ఎంపిక చేసింది. వీరికి దేవస్థానం నిర్వహణకు సంబంధించిన కీలక బాధ్యతలు అప్పగిచింది
- Author : Sudheer
Date : 30-10-2024 - 7:52 IST
Published By : Hashtagu Telugu Desk
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) ప్రకటించింది. కొత్త చైర్మన్‌గా TV5 అధినేత బీఆర్ నాయుడు(BR Naidu)ను నియమించింది. కొత్త పాలక మండలిలో మొత్తం 24 మంది సభ్యులను ప్రభుత్వం ఎంపిక చేసింది. వీరికి దేవస్థానం నిర్వహణకు సంబంధించిన కీలక బాధ్యతలు అప్పగిచింది. వీరిలో ముగ్గురు ఎమ్మెల్యేలకు చోటు కల్పించడం విశేషం. అలాగే తెలంగాణకు చెందిన ఐదుగురికి , కర్ణాటకకు చెందిన ముగ్గురికి , తమిళనాడుకు చెందిన ఇద్దరికి , గుజరాత్, మహారాష్ట్ర నుంచి ఒక్కొక్కరికి చోటు కల్పించారు.
కొత్తగా ఎంపికైన టీటీడీ సభ్యుల (Details of TTD Members) వివరాలు…
జ్యోతుల నెహ్రూ
వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
ఎంఎస్ రాజు
పనబాక లక్ష్మి నర్సిరెడ్డి
సాంబశివరావు,
సదాశివరావు సన్నపనేని,
కృష్ణమూర్తి
కోటేశ్వరరావు
మల్లెల రాజశేఖర్ గౌడ్
జంగా కృష్ణమూర్తి
ఆర్ ఎన్ సుదర్శన్
జస్టిస్ హెచ్ ఎల్ దత్
శాంతారాం
పి.రామ్మూర్తి
సురభ్ హెచ్ బోరా
తమ్మిశెట్టి జానకీదేవి
బూనుగునూరు మహేందర్ రెడ్డి
అనుగోలు రంగశ్రీ