Botsa : ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన బొత్స
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఎవరనేది సోమవారం ప్రకటించే అవకాశం ఉందని వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు.
- Author : Latha Suma
Date : 12-08-2024 - 3:31 IST
Published By : Hashtagu Telugu Desk
Botsa Satyanarayana: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ(MLC of local bodies) వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నామినేషన్ వేశారు. విశాఖ కలెక్టరేట్లో ఆయన నామపత్రాలు దాఖలు చేశారు. అటు టీడీపీ బరిలో ఉంటుందా? లేదా? అన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. నామినేషన్ అనంతరం బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ..’ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కోరారు. ఈ క్రమంలోనే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఈరోజు నామినేషన్ వేశాను. మాకు సంఖ్యా బలం ఉంది. వైసీపీ తప్పకుండా విజయం సాధిస్తుంది. మాకు 530 మందికి పైగా ప్రజాప్రతినిధుల బలం ఉన్నప్పుడు కూటమి అభ్యర్థిని ఎందుకు బరిలో నిలుపుతోంది?. వైసీపీకి బలం ఉన్నప్పుడు అనైతికంగా ఎందుకు అభ్యర్థిని పెడుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఒకవేళ టీడీపీ కనుక అభ్యర్థిని నిలబెడితే అది దుశ్చర్య అవుతుంది. ఇదిమే వ్యాపారం కాదు. మోజార్టీ ఉంది కాబట్టే పోటీ చేస్తున్నాం. మాకు నివాదం అవసరం లేదు. రాజకీయాల్లో విలువలు అవసరం. సంఖ్య దగ్గరగా ఉంటే తప్పులేదు. మాకు మెజార్టీ ఉన్నప్పుడు టీడీపీ అభ్యర్థిని నిలబెడుతుందని నేను అనుకోవడం లేదు’ అంటూ కామెంట్స్ చేశారు.
కాగా, విశాఖ ఎమ్మెల్సీ స్థానానికి ఆగస్టు 13తో నామినేషన్ల గడువు ముగుస్తుంది. నామినేషన్‌కు ఇంకా ఒక్క రోజు మాత్రమే గడువు ఉండటంతో.. కూటమి అభ్యర్థి బరిలోకి దిగుతారా ? లేదా అనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఒకవేళ కూటమి తరపున అభ్యర్థి బరిలోకి దిగితే.. విశాఖ తీరంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రాజకీయం మరింత రసవత్తరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.