Note For Vote: ఓటుకు నోటు కేసులో సీఎం చంద్రబాబుకు ఊరట
రాజకీయ కక్ష సాధింపులకు కోర్టును వేదికగా చేసుకోవద్దని రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎం. సుందరేష్, జస్టిస్ అరవింద్ కుమార్‌లతో కూడిన బెంచ్ మందలించింది.
- By Pasha Published Date - 03:49 PM, Wed - 21 August 24

Note For Vote: ఓటుకు నోటు కేసులో(Note For Vote) ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు ఊరట లభించింది. ఈ కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని, దీని దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ వైఎస్సార్ సీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు బెంచ్ డిస్మిస్ చేసింది. రాజకీయ కక్ష సాధింపులకు కోర్టును వేదికగా చేసుకోవద్దని రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎం. సుందరేష్, జస్టిస్ అరవింద్ కుమార్‌లతో కూడిన బెంచ్ మందలించింది. ‘‘ఆధారాలు లేని అంశాలను తీసుకొచ్చి కోర్టుతో ఆటలాడొద్దు. పిటిషనర్ ఆళ్ల రామకృష్ణారెడ్డికి రాజకీయాలతో సంబంధం ఉంది. కావాలంటే మళ్లీ మీరు ఎన్నికల్లో పోటీ చేసి గెలవండి’’ అని సుప్రీంకోర్టు బెంచ్ సూచించింది. ఆ మేరకు గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించింది.
We’re now on WhatsApp. Click to Join
ఈ కేసులో విచారణ సందర్భంగా పిటిషనర్ ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘‘ఫోన్ మాట్లాడుతూ చంద్రబాబు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఫోన్ కాల్ రికార్డ్స్ ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటేస్తే రూ.5 కోట్లు ఇస్తామన్నారు. గైర్హాజరు అయితే రూ.2 కోట్లు ఇస్తామన్నారు’’ అని చెప్పారు. ఈ పిటిషన్లపై చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. అయితే చంద్రబాబు వాదనను సుప్రీంకోర్టు బెంచ్ సమర్ధించింది. రాజకీయ దురుద్దేశంతో చంద్రబాబును ఈ కేసులో ఇరికించాలని భావిస్తున్నారని పేర్కొంది.
2014 – 19తో పోలిస్తే 2019 – 24 మధ్యకాలంలో ఏపీలో క్రైమ్ రేటు 46.8 శాతం పెరిగింది. ఈమేరకు వివరాలతో రూపొందించిన ఒక నివేదికను ఏపీ హోంశాఖ అధికారులు సీఎం చంద్రబాబుకు అందించారు. జగన్ పాలనా కాలంలో మహిళలపై నేరాలు 36 శాతం, పిల్లలపై నేరాలు 152 శాతం, మిస్సింగ్ కేసులు 84 శాతం, సైబర్ క్రైం 134 శాతం పెరిగాయని నివేదికలో ప్రస్తావించారు. దీనికి సంబంధించి చంద్రబాబు నిర్వహించిన సమీక్ష సమావేశంలో హోంమంత్రి అనిత, డీజీపీ ద్వారకా తిరుమలరావు తదితరులు ఉన్నారు.