Cockfights : కోట్లు కుమ్మరిస్తున్న పందెం కోళ్లు..
Cockfights : ఈరోజు కనుమ తో సంక్రాంతి సంబరాలు ముగుస్తుండడం తో పెద్ద ఎత్తున పందేలు జరుగుతున్నాయి
- By Sudheer Published Date - 10:53 AM, Wed - 15 January 25

ఏపీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. గతంలో లేని విధంగా, ఈసారి పెద్ద సంఖ్యలో ప్రజలు తమ సొంత ఊళ్లకు వచ్చి కోడి పందేల (Cockfights) వైపు ఆకర్షితులయ్యారు. గోదావరి జిల్లాల్లో ఈ పందెలు ప్రత్యేక హంగులతో జరుగుతున్నాయి. అనేక గ్రామాల్లో పందేలు ఫుల్ జోరుగా నడుస్తున్నాయి. ఈరోజు కనుమ తో సంక్రాంతి సంబరాలు ముగుస్తుండడం తో పెద్ద ఎత్తున పందేలు జరుగుతున్నాయి. ఈసారి కోడి పందేలు పులివెందులలో కూడా నిర్వహిస్తున్నారు. గోదావరి జిల్లాల్లో జరుగుతున్న కోడిపందేలలో పెద్ద మొత్తంలో డబ్బులు వస్తూ, చేతులు మారుతున్నాయి. ఈ పందేల్లో గెలిచేవారు కోట్ల రూపాయిలు దండుకుంటున్నారు.
Chandrababu : చంద్రబాబు కాన్సెప్ట్ సూపర్..
ఈ పందేలలో కొన్ని నిమిషాల్లో వంద కోట్ల రూపాయలు గెలిచే వారి చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. గ్యాంబ్లింగ్ తరహా ఈ పందెలు, ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బును కుమ్మరిస్తూ, గెలిచిన వారు మరింత ఉత్సాహంతో మరిన్ని పందేలు ఆడటంతో ఈ లావాదేవీలు మరింత పెరుగుతున్నాయి. కానీ ఓడిపోయిన వారు అప్పటికప్పుడు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈ కోడి పందేలు పెరుగుతున్న గ్యాంబ్లింగ్ వ్యాపారం ఆర్థికంగా కొంతమంది వారికి లాభం చేకూర్చినప్పటికీ, మరికొంతమంది జీవితాలు నాశనం అవుతుంటాయి. ఇది ప్రజలకు ఆర్థిక సంక్షోభాలను కూడా తెస్తోంది. ఇకపోతే, ఈ సంస్కృతి రోజురోజుకి పెరిగితే, రాబోయే రోజుల్లో సంక్రాంతి పండగ అంటే మిగతా అన్ని పండుగలను మర్చిపోయి కేవలం కోడి పందేలు మాత్రమే గుర్తుకు తెస్తుందని చెప్పవచ్చు.