Chandrababu : చంద్రబాబు కాన్సెప్ట్ సూపర్..
CHandrababu : గ్రీన్ ఎనర్జీ ద్వారా ప్రతి కుటుంబానికి లాభం కలిగించే కాన్సెప్ట్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విస్తృతంగా అమలు చేయాలని భావిస్తున్నారు
- By Sudheer Published Date - 10:42 AM, Wed - 15 January 25

ఏపీ సర్కార్ (AP Govt) సంప్రదాయేతర ఇంధన విద్యుత్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆహ్వానిస్తున్నది. అయితే, ఈ పెట్టుబడులు సామాన్య ప్రజలపై పెద్దగా ప్రభావం చూపకుండా, కొన్ని వర్గాలకు మాత్రమే ఉపయోగపడతాయి. అయితే, గ్రీన్ ఎనర్జీ (Green Energy) ద్వారా ప్రతి కుటుంబానికి లాభం కలిగించే కాన్సెప్ట్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విస్తృతంగా అమలు చేయాలని భావిస్తున్నారు. సోలార్ ఎనర్జీని వినియోగించి, ఇళ్లకు అవసరమైన విద్యుత్ ను ఉత్పత్తి చేయడం మాత్రమే కాకుండా, అదనంగా ఉత్పత్తి అయిన విద్యుత్తును గ్రీడ్‌కు మళ్లించే పద్ధతిని ప్రభుత్వం అమలు చేయాలని నిర్ణయించింది. కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా దీనిని మొదలు పెట్టారు. చంద్రగిరి నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో ఈ విధానాన్ని మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
Saudi Arabia : సౌదీ అరేబియా వెళ్తున్నారా.. ఇది మీకోసమే..!
సోలార్ యూనిట్ ఏర్పాటు చేయడం ఖర్చుతో కూడుకున్న పని. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అతి తక్కువ ధరలో ఈ యూనిట్లను ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తోంది. దీంతో ప్రజలు కరెంట్ చార్జీలను తగ్గించుకోగలుగుతారు. అదనంగా ఉత్పత్తి అయిన విద్యుత్ గ్రిడ్‌కు చేరితే, ప్రజలకు ఆదాయం కూడా కలగవచ్చు. కరెంట్ చార్జీలు ఎప్పటికప్పుడు పెరుగుతుండడం సామాన్య ప్రజలపై భారీ భారం అవుతోంది. వీటిని తగ్గించడం ద్వారా ప్రజల కోసం కొన్ని అనుకూల మార్పులు తీసుకురావచ్చు. సాధారణంగా ఒక మధ్యతరగతి కుటుంబం నెలకు వెయ్యి రూపాయల వరకు కరెంట్ బిల్లు చెల్లిస్తుంది. సోలార్ యూనిట్లు తక్కువ ఖర్చుతో ఏర్పాటు చేయడం వలన ఈ ఖర్చులు తగ్గుతాయి, ఇతర అవసరాలకు ఆ డబ్బును వినియోగించుకోవచ్చు. ఈ విధానం విజయవంతంగా అమలయితే, ఇది ఒక గేమ్ ఛేంజర్ అవుతుంది. వచ్చే పదేళ్లలో ప్రజలందరికీ ఆదాయం పెంచేలా సోలార్ ఎనర్జీ స్కీమ్స్ విస్తరించి అమలు చేయడం వల్ల సామాన్యులకు పెద్ద ప్రయోజనం చేకూరుతుంది.