Tirupati Laddu: తిరుపతి లడ్డూ తయారీలో గోమాంసం, చేప నూనె!
రిపబ్లిక్ టీవీతో పాటు టీడీపీ మోస్ట్ సీనియర్ నాయకుడు ఆనం వెంకటరమణారెడ్డి కూడా ఓ ప్రెస్ మీట్ పెట్టి లడ్డూలో చేప నూనె, ఎద్దు మాంసం, ఇతర జంతువుల నూనెలు కలిశాయని సాక్ష్యాధారాలతో సహా మీడియాకు చూపారు.
- By Gopichand Published Date - 06:20 PM, Thu - 19 September 24

Tirupati Laddu: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి లడ్డూ (Tirupati Laddu) తయారీలో ఎద్దు మాంసం, చేప నూనె వాడినట్లు పరీక్షల్లో నిర్ధారణ అయినట్లు రిపబ్లిక్ టీవీ వెల్లడించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో జంతువుల మాంసం వినియోగించారని సీఎం చంద్రబాబు సైతం ఆరోపించారు. అయితే దీనిని టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కొట్టిపారేసిన విషయం తెలిసిందే.
జగన్ అనే క్రూరుడు చేసిన ఘోరమైన నేరం ఇది..
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది పరమపవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డూలో గొడ్డుమాంసం, చేపనూనెలు, పంది కొవ్వు నుంచి తీసిన పదార్థాలనే నెయ్యిగా వాడి ఏడుకొండల వెంకటేశ్వరస్వామికి తీరని అపచారం చేశారు. కోట్లాది భక్తుల న… pic.twitter.com/7QXVyF6sAz— Telugu Desam Party (@JaiTDP) September 19, 2024
రిపబ్లిక్ టీవీతో పాటు టీడీపీ మోస్ట్ సీనియర్ నాయకుడు ఆనం వెంకటరమణారెడ్డి కూడా ఓ ప్రెస్ మీట్ పెట్టి లడ్డూలో చేప నూనె, ఎద్దు మాంసం, ఇతర జంతువుల నూనెలు కలిశాయని సాక్ష్యాధారాలతో సహా మీడియాకు చూపారు. గుజరాత్‌లో ఉన్న నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఈ రిపోర్టు ఇచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది పరమపవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డూలో గొడ్డుమాంసం, చేపనూనెలు, పంది కొవ్వు నుంచి తీసిన పదార్థాలనే నెయ్యిగా వాడి ఏడుకొండల వెంకటేశ్వరస్వామికి తీరని అపచారం చేశారని ఆయన మండిపడ్డారు. తిరుపతి లడ్డూలో ఫిష్ ఆయిల్, సోయాబిన్, సన్ ఫ్లవర్ సీడ్, మైదా, కొబ్బరి, గొడ్డు మాంసంలో వచ్చే పదార్థాలు వాడినట్లు ఆ రిపోర్టులో ఉంది. దీంతో హిందూ మత సంఘాలు సైతం వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
తిరుమల వెంకన్నకు ఇచ్చిన నెయ్యిలో ఈ పదార్థాలున్నాయి…
ఫిష్ ఆయిల్
సోయాబిన్
సన్ ఫ్లవర్ సీడ్
మైదా
కొబ్బరి
గొడ్డు మాంసంలో వచ్చే పదార్థాలుఈ రిపోర్ట్ ఇచ్చింది ఈ దేశంలోనే నెం.1 ల్యాబ్. ఆధారాలు బయటపెట్టిన టీడీపీ #ttd #ttdladdu #tirumala #YVSubbaReddy pic.twitter.com/llfqSFnaEw
— Telugu360 (@Telugu360) September 19, 2024
అయితే తిరుమల లడ్డూ తయారీ కోసం గత 50 ఏళ్లుగా కర్ణాటకకు చెందిన కేఎంఎఫ్‌కి చెందిన నందిని నెయ్యిని వాడుతుండగా.. జగన్ వచ్చి కేఎంఎఫ్ బదులు మరో తమిళనాడు కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చాడు. ఎందుకు అంటే రేటు తక్కువ అన్నాడు. తాము ఇచ్చే నెయ్యి తక్కువకే ఇస్తున్నామని.. అంత కన్నా తక్కువ రేటుకు ఎవరైనా ఇస్తే తప్పనిసరిగా నాణ్యతా లోపం ఉన్నట్టే అని కేఎంఎఫ్ సంస్థ అధ్యక్షుడు బహిరంగ ప్రకటన కూడా చేసాడు. అందుకు తగ్గట్టుగా జగన్ తెచ్చిన తమిళనాడు కంపెనీ నెయ్యికి బదులు జంతువుల కొవ్వును సరఫరా చేసిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అంటే జగన్ కావాలనే తిరుమల లడ్డూని అపవిత్రం చేసే కుట్ర చేసాడు. దేవదేవుడితో ఆటలాడాడు అని టీడీపీ ఆరోపిస్తుంది.