Laddu Controversy : శ్రీవారి పవిత్రతను దెబ్బతీశారు..చంద్రబాబుకు బండి సంజయ్ లేఖ..!
Bandi Sanjay letter to Chandrababu: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వినియోగం తీవ్ర ఆందోళనగా ఉందని… శ్రీవారి భక్త కోటిని, యావత్ ప్రపంచంలోని హిందువుల మనోభావాలను తీవ్రంగా కలిచి వేస్తోందని తెలిపారు.
- By Latha Suma Published Date - 02:48 PM, Fri - 20 September 24

Bandi Sanjay letter to Chandrababu: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ వివాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వినియోగం తీవ్ర ఆందోళనగా ఉందని… శ్రీవారి భక్త కోటిని, యావత్ ప్రపంచంలోని హిందువుల మనోభావాలను తీవ్రంగా కలిచి వేస్తోందని తెలిపారు. శ్రీవారి పవిత్రతను దెబ్బతీశారని, అన్యమత ప్రచారం జరుగుతోందని గతంలో ఫిర్యాదులు వచ్చినా గత పాలకులు పట్టించుకోలేదని ఆగ్రహించారు.
Read Also: Jagan Press Meet : లడ్డు వివాదం ఫై జగన్ ఏమంటారో..?
ఎర్రచందనం కొల్లగొడుతూ ఏడు కొండలవాడిని రెండు కొండలకే పరిమితం చేశారని చెప్పినా స్పందించలేదని.. ‘జంతువుల కొవ్వును లడ్డూ ప్రసాదంలో వినియోగించారని మీరు(చంద్రబాబు) చేసిన వ్యాఖ్యలతో లడ్డూ ప్రసాదంలో కల్తీ నిజమేనని యావత్ హిందూ సమాజం భావిస్తోందని ఆగ్రహించారు. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వును వినియోగించడం అత్యంత నీచమని మండిపడ్డారు. హిందూ ధర్మంపై దాడికి భారీ కుట్ర జరిగినట్లుగానే భావిస్తున్నామని… లడ్డూ ప్రాముఖ్యతను తగ్గించడానికి, టీటీడీపై కోట్లాది మంది భక్తులకు ఉన్న విశ్వాసాన్ని సడలించేందుకు ఈ కుట్ర చేశారని ఆగ్రహించారు. దీనిపై సీబీఐతో విచారణ జరిపిస్తేనే సమగ్ర దర్యాప్తు జరిగి వాస్తవాలు నిగ్గు తేలే అవకాశముందన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబును కోరారు.
Read Also: QR code : ఇక పై తెలంగాణ ఆర్‌టీసీ బస్సుల్లో క్యూఆర్ కోడ్ చెల్లింపులు
రాజకీయ ప్రయోజనాలను పూర్తిగా పక్కనపెట్టి ప్రపంచంలోని యావత్ హిందువుల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నది. తక్షణమే సమగ్ర విచారణకు ఆదేశించాలని, దోషులుగా తేలిన వారు ఎంతటి వారైనా, ఏ పార్టీ వారైనా సరే చట్ట ప్రకారం శిక్ష పడేలా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. హిందూ ధార్మిక క్షేత్రంలో అన్యమత ప్రచారం కూడా పూర్తిగా నిషిద్ధం. దేవుడిపై నమ్మకం లేని నాస్తికులకు, అన్యమతస్తులకు టీటీడీ పగ్గాలు అప్పగించడంవల్లే పవిత్రమైన తిరుమల కొండపై ఇలాంటి నీచమైన, ఘోరమైన కార్యక్రమాలకు ఆస్కారం ఏర్పడింది. ఇకపై అలాంటి వారికి టీటీడీ పగ్గాలు అప్పగించకుండా, అన్యమత ప్రచారం జరగకుండా కఠినమైన చట్టాలు తీసుకురావాలని కోరుతున్నా. తిరుమల కొండ పవిత్రతపై, లడ్డూ ప్రసాదాలపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివ్రత్తి చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నానని లేఖలో బండి సంజయ్ పేర్కొన్నారు.
Read Also: Keto Diet Effects : కీటో డైట్ డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుందట.. తాజా అధ్యయనంలో వెల్లడి..!