Jagan Press Meet : లడ్డు వివాదం ఫై జగన్ ఏమంటారో..?
Jagan Press Meet : తిరుమల లడ్డూ నాణ్యత సరిగా లేదని వెంకటేశ్వరస్వామి పవిత్రతను దెబ్బతీశారని
- By Sudheer Published Date - 02:27 PM, Fri - 20 September 24

Jagan Tirumala Laddu : ఏపీలో మొన్నటి వరకు ప్రకాశం బ్యారేజ్ లోకి బోట్లను వదిలిన అంశం కాకరేపగా..ఇప్పుడు తిరుమల లడ్డు వివాదం రాజుకుంది. తిరుమల లడ్డు (Tirumala Laddu) ప్రసాదంలో నెయ్యి (Pure Ghee)కి బదులు జంతువుల కొవ్వు (Animal Fat ) వాడారని చంద్రబాబు (Chandrababu) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. గత ప్రభుత్వంలో హిందూ దేవాలయాలపై పలు దాడులు , అనేక దుశ్చర్యాలు జరిగాయని ఇప్పటికే హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా..ఇప్పుడు ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో లడ్డు ప్రసాదాన్ని జంతువుల కొవ్వుతో తయారు చేశారనేది తట్టుకోలేకపోతున్నారు. మరోపక్క కేంద్ర ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి (Union Food Minister Prahlad Joshi) సైతం ఈ వివాదం ఫై సీరియస్ అయ్యారు. ఘటనపై వెంటనే సమగ్ర దర్యాప్తునకు ఆదేశిస్తామని అన్నారు.
దేవుడి ప్రసాదం (Tirumala Laddu) అపవిత్రం చేసేలా నాసిరకం పదార్థాలు వాడారని , గతంలో తిరుమల లడ్డూ నాణ్యత సరిగా లేదని వెంకటేశ్వరస్వామి పవిత్రతను దెబ్బతీశారని , అన్నదానంలో కూడా నాణ్యత పాటించలేదని , దేవుడి ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని కీలక వ్యాఖ్యలు చేసారు చంద్రబాబు. అయితే చంద్రబాబు వ్యాఖ్యలను వైసీపీ నేతలు ఖండిస్తున్నారు. ప్రసాదం లో ఎలాంటి తప్పు జరగలేదని..చంద్రబాబు రాజకీయ అవసరాల కోసం తప్పుడు వ్యాఖ్యలు చేసారని అంటున్నారు. ఈ క్రమంలో కాసేపట్లో మాజీ సీఎం జగన్ ఈ వివాదం ఫై స్పందించబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. మరి జగన్ దీనిపై ఏమంటారో..? ఇలాంటి నిజాలు బయటపెడతారో చూడాలి.
Read Also : QR code : ఇక పై తెలంగాణ ఆర్‌టీసీ బస్సుల్లో క్యూఆర్ కోడ్ చెల్లింపులు